ఆ స్టార్ డైరెక్టర్ ఓవర్ యాక్షన్… వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్‌…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలు ద‌ర్శ‌కులు కూడా ఎన్టీఆర్‌తో సినిమాలు చేయ్యాడాని రేడి అవుతున్నారు. తాజా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోష‌న్‌తో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నంటిచ‌బోతున్న‌డు. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్నాయి. ఎన్టీఆర్ కు టెంపర్ సినిమాకు ముందు చాలా ఫ్లాప్‌లు వచ్చాయి.

వరుసగా శక్తి, దమ్ము, రభస, రామయ్య వస్తావయ్య లాంటి ఫ్లాప్ సినిమాలతో మనవాడి మార్కెట్ బాగా దెబ్బతింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్లను నమ్ముకున్న ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. సింహా లాంటి హిట్ సినిమా తర్వాత బోయపాటిని నమ్మి దమ్ము చేస్తే ప్లాప్ అయ్యింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీశంకర్ తో రామయ్య వస్తావయ్య చేస్తే అది కూడా ఫ్లాప్ అయింది.

Jr NTR's witty comments about his flop cinema surprises everyone

కందిరీగ లాంటి హిట్ సినిమా ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో రభస చేస్తే ఫ్లాప్ అయింది. దూకుడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన శ్రీను వైట్లతో బాద్‍షా సినిమా చేస్తే అది కూడా దూకుడు స్థాయి సినిమా అనిపించుకోలేదు. ఇలా వరుసగా ఎన్టీఆర్ హిట్ డైరెక్టర్ల వెంట పడగా ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఈ కోవలోనే హరీష్ శంకర్ తో రామయ్య వస్తావయ్య సినిమా చేశాడు.

N.T. Rama Rao Jr movies, photos and other details | Clapnumber

ఆ సినిమా క్లైమాక్స్ విదేశాల్లో జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్.. వినాయక్, రాజమౌళి తప్ప ఎవరు హిట్ ఇవ్వలేకపోతున్నారు, వరుసగా ప్లాపులు వస్తున్నాయి.. అని కాస్త బాధపడ్డాడట. అక్కడే కొందరు సన్నిహితులతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఉన్నాడు. వెంట‌నే హ‌రీష్ శంక‌ర్ ఎన్టీఆర్ ముఖం మీద‌కు వ‌చ్చేసి భ‌య్యా నేను నీకు హిట్ ఇస్తాను.. నేను నీకు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తాను.. ఈ సినిమా మాత్ర‌మే కాదు… మ‌ళ్లీ సినిమా కూడా చేసి హిట్ ఇస్తాను అని ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తూ క‌టింగ్ ఇచ్చాడ‌ట‌.

Harish Shankar feeling about NTR

వెంట‌నే ఎన్టీఆర్ కోపంతో ఎవ‌డు ? ఎవ‌డికి హిట్ ఇస్తారు చూద్దం… ఇండ‌స్ట్రీకి నువ్వు ఎప్పుడు వ‌చ్చావ్ ? నేను ఎప్పుడు వ‌చ్చాను ? నువ్వు నాకు కాదు హిట్ ఇచ్చేది.. నేను నీకు మంచి ఛాన్స్ఆవ‌కాశం ఇచ్చాను అని కాస్త ఫైర్ అయ్యాడ‌ట‌. ఇక ఈ సినిమా వాడుద‌లై ఫ్లాప్ సినిమాగా మిగిలి పొయింది. దీంతో హ‌రీష్ మ‌ళ్ళీ ఎన్టీఆర్‌తో సినిమా చేయ్య‌డానికి రాలేదు.