`అమిగోస్` అంటే అర్థం ఏంటి..? క‌ళ్యాణ్ రామ్ మూవీకి ఆ డిఫరెంట్ టైటిల్ ఎందుకు పెట్టారు?

నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి మరో రెండు రోజుల్లో `అమిగోస్‌` అనే మూవీ ప్రేక్షకలు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది.

ఫిబ్ర‌వ‌రి 10న ఈ చిత్రం అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. అయితే `అమిగోస్‌` అంటే అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. అసలు `అమిగోస్‌` అనే డిఫరెంట్ టైటిల్ ను కళ్యాణ్ రామ్ మూవీకి ఎందుకు పెట్టారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతుంది. ఈ విషయంపై తాజాగా కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. అమిగోస్ అంటే ఫ్రెంచ్ భాషలో `స్నేహితులు` అని అర్థం. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశాడు.

అయితే ఈ సినిమాకు స్నేహితులు.. ముగ్గురు స్నేహితులు అంటూ రొటిన్ టైటిల్ పెట్టాలని అనుకోలేద‌ని, స్నేహితులు అనే పదాలకు ఇతర భాషల్లో ఇంకా ఎలాంటి పదాలు వున్నాయో వెతికామ‌ని, అప్పుడు అమిగోస్ అనే పేరు గుర్తొచ్చింద‌ని క‌ళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల బ్యానర్ పేరు అమిగోస్ క్రియేషన్స్.. అమిగోస్ అనే టైటిల్ పెడితే కొత్తగా వుంటుంది పైగా క్యాచీగా వుంటుందని భావించామ‌ని అందుకే ఆ టైటిల్ ను ఫైన‌ల్ చేశామ‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో క‌ళ్యాణ్ రామ్ స్ప‌ష్టం చేశారు.