చెప్పుకోలేని బాధలు అనుభవించిన ఆ సినీ దర్శకురాలు.. ఎవరంటే?

 

తెలుగు ప్రేక్షకులకు చాలా మందికి బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ గురించి తెలిసే ఉంటుంది. ఫరా ఖాన్ బాలీవుడ్లో చాలా సినిమాలకు నిర్మాతగా, కొరియోగ్రాఫర్ గా వ్యవహారించారు. ఆమె కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫరా ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్‌యే అయినా మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే. ఫరా ఖాన్ అందించిన చాలా పాటలు ఆమెకి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అంతేకాకుండా, ఆమె 80 సినిమాల్లోని 100కి పైగా పాటలకి సంగీతాన్ని అందించింది.

ఫరా ఖాన్ మొదట మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తరువాత డైరెక్టర్‌గా మారింది. ఇదిలా ఉండగా ఫరా ఖాన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నిజ జీవితంలో తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి అభిమానులతో పంచుకుంటూ కంట తడి పెట్టింది. ఇండియన్ ఐడల్ 13 కార్యక్రమంలో పాల్గొన్న ఫరా ఖాన్ ఈ విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ తన తండ్రి చనిపోయినప్పుడు కేవలం తన ఫ్యామిలీ దగ్గర రూ. 30 మాత్రమే ఉన్నాయని.. తనకి 18 ఏళ్ళు వున్నపుడు ఆమె తండ్రి మరణించారని చెప్పి ఆమె వాపోయింది.

ఆ సమయంలో అంత్యక్రియలు చేయడానికి కూడా తన దగ్గర డబ్బు లేదట. తండ్రి మరణించేటప్పటికి ఫరా సోదరుడి వయసు 14 ఏళ్లు. ఆ సమయంలో వారికి ఎక్కడికి వెళ్లాలో తెలియక తన బంధువుల ఇంట్లోనే ఒక్క స్టోర్ రూమ్ లో దాదాపు ఆరేళ్లు ఉన్నారట. కనీసం అప్పుడు వారికి ఇంటి స్థలం కూడా లేదట. ఇక ఆమె సోదరుడు సాజిద్ ఖాన్ బిగ్‌బాస్ సీజన్ 16కి వెళ్లి ఇదే విషయం గురించి ప్రస్తావించాడు. మద్యం మత్తులో తన తండ్రి మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి కూడా తమ దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. ఇక అప్పుడే సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ అంత్యక్రియలకు, రేషన్, కరెంట్ బిల్లు కోసం డబ్బులు ఇచ్చి సహాయం చేసారు అని ఆమె తెలిపింది.