రవితేజ కెరీర్‌పై పెద్ద దెబ్బ వేస్తున్న ఆ వర్గ ప్రజలు.. ఎవరంటే..?

మాస్ మహారాజ రవితేజ రీసెంట్‌గా చేసిన యాక్షన్ కామెడీ ఫిలిం ధమాకా. ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చి కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. పాజిటివ్ రెస్పాన్స్‌తో ధమాకా సినిమా కొన్ని రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది అలాగే అధికారికంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే 100 కోట్లు కలెక్ట్ చేయడం అబద్ధం అంటూ ఒక మీడియా సంస్థ వార్త రాసి పెద్ద వివాదానికి తెరలేపింది.

ధమాకా సినిమా కమర్షియల్ హిట్ అయిన మాట వాస్తవమే కానీ రూ.100 కోట్లు కలెక్ట్‌ చేయడమనేది పచ్చి అబద్ధం అంటూ ఆ మీడియా ఒక కథనం రాసుకొచ్చింది. ధమాకా సినిమా ఇప్పటివరకు రూ. 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని మాత్రమే సినిమా వసూలు చేసినట్లు ఈ స్టోరీ ఆరోపించింది. యూనిట్ సభ్యులు మాత్రం రూ.100 కోట్ల కలెక్షన్స్ అంటూ హడావుడి చేస్తున్నారని పేర్కొంది. ఈ వార్త చదివిన తర్వాత రవితేజ ఫ్యాన్స్ సదరు మీడియా సంస్థ పై ఫైర్ అవుతున్నారు. మంచిగా ఆడిన సినిమా, బాగా కలక్షన్లను వసూలు చేసిన సినిమా గురించి ఇలా తప్పుడు వార్తలు రాస్తూ అతడి కెరీర్‌కి దెబ్బసే విధంగా ప్రవర్తిస్తున్నారని, రవితేజను కిందికి లాగే ప్రయత్నాలు చేస్తున్నారని వీరు సదరు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూ.100 కోట్ల కలెక్షన్స్‌కి సంబంధించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అఫీషియల్ లెక్కలు, ఐటీ పేమెంట్స్ కనుక్కుని మాట్లాడాలని కామెంట్లు చేస్తున్నారు. అలానే ధమాకా సినిమా సూపర్ హిట్ ఫిలిం అని, ఇది మొత్తంగా రూ.120 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.