ఇంట్రెస్టింగ్: ఉదయ్ కిరణ్ లైఫ్‌లో మ‌ర్చిపోలేని..‘మిస్టీరియస్ గర్ల్’..!

తెలుగు తెరపైకి ఎగిసిపడిన యువ కెరటంలా దూసుకు వచ్చిన హీరో ఉదయ్ కిరణ్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని ముద్ర వేసుకునీ వరుస విజయాలతో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగాడు. ఫుల్ జోష్ మీద వెళ్తున్న కెరీర్ ఒకసారిగా డౌన్ ఫాల్ అయింది. వరుస పరాజయాలతో పర్సనల్ లైఫ్ ఇబ్బందులతో సరైన గైడెన్స్ లేకపోవడంతో చాలాకాలం ప్రేక్షకులకు దూరమయ్యాడు.

Uday Kiran Birth Anniversary: ದುರಂತ ನಾಯಕ ಉದಯ್​ ಕಿರಣ್​ ಸಾವಿಗೆ ಕಾರಣವಾಯ್ತಾ ಆ  ಒಂದು ಘಟನೆ | Uday Kiran Birth Anniversary late Uday Kiran was paid 11  thousand for his first movie Chitram ae– News18 Kannada

ఆ క్రమంలోనే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆత్మహత్య చేసుకొని తన కుటుంబ సభ్యులకు ప్రేక్షకులకు శాశ్వతంగా దూరమయ్యాడు. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామందికి ఉదయ్ కిరణ్ గుర్తుకు రాగానే అతను చేసిన మొదటి సినిమా చిత్రం గుర్తుకొస్తుంది. అయితే అతను ఈ సినిమా కన్నా ముందే హిందీ, ఇంగ్లీష్ బైలింగ్వల్ సినిమా చేశాడు. ఆ సినిమా పేరు మిస్టీరియస్ గ‌ర్ల్‌.

Uday Kiran suicide: Reasons behind his death revealed (see pics) |  Bollywood News – India TV

ఆ సినిమాను ఎవరో కొనుక పోవడంతో ప్రేక్షకులు ముందుకు రాలేదు. అందుకే ఆ సినిమా ఉందనే విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. 2003వ సంవత్సరంలో ఉదయ్ కిరణ్ కు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మంచి ఇమేజ్ వచ్చింది. ఆయన సినిమాలు వరుసగా ఘన విజయాలు అందుకున్నాయి. ఆ సమయంలో ఈ మిస్టీరియస్ గర్ల్ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ కొన్ని అనుకోని పరిణామాల వల్ల అదీ కుదరలేదు.

ఉదయ్ కిరణ్ కు మల్లెమాల ఘన నివాళి.. ఎమోషనల్ అయిన ఉదయ్ కిరణ్ చెల్లెలు |  mallemala tribute to uday kiran in hello brother show details, uday kiran,mallema,tollywood,etv,,  hello brother show ...

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ రెమ్యూనరేషన్ గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఎంతోమంది యువకులు సినిమాలలో నటించడానికి పోటి పడే సమయంలో 18 ఏళ్లకే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌కి యువ హీరోగా అడుగుపెట్టి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. ఉదయ్‌ నటించిన మొదటి సినిమా కూడా ఒక సంచలమే.. తొలి సినిమాతోనే హిందీ- ఇంగ్లీష్ బైలింగ్వల్ చేయటం ఎంతో గొప్ప విషయం.. అయినప్పటికీ ఈ సినిమా థియేటర్స్ కు రాకపోవడం కొంత బాధాకరం.