సమంత అందంపై నెట్టింట ట్రోల్స్‌.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన స్టార్‌ హీరో..!

స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయో సిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుని తన ఇంట్లోనే ఆ వ్యాధికి వైద్యం తీసుకుంటుంది. గత కొంతకాలంగా సమంత లుక్స్‌పై కూడా ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సమంత ఆ వ్యాధి నుంచి కోలుకుని తాజాగా ఎయిర్‌ పోర్ట్‌ లో, నిన్న ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ఎంతో డల్ గా కనిపించింది.

Samantha Ruth Prabhu gives a savage reply to a post that says 'she lost all her charm and glow' | PINKVILLA

ఈ వెంట్‌లో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయి కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇప్పుడు ఈ విషయం పక్కనబెడితే చాలా రోజుల తర్వాత కనిపించిన సమంతపై ఆమె అభిమానులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఆమె లుక్స్‌పై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సమంత లుక్స్‌పై ఓ సెటారికల్ కామెంట్ షేర్ చేశాడు. సమంత కూడా ఆ కామెంట్ కి అదిరిపోయే రిప్లై కూడా ఇచ్చింది.

Samantha is 'extremely nervous and excited' ahead of Yashoda release | Bollywood Bubble

”సామ్‌ మీరు చాలా బక్కగా అయినట్టు, ముఖంలో కూడా కళ పోయినట్టు, చాలా డల్ గా కనిపిస్తున్నారు, నిజానికి మీ ఫేస్‌ లో గ్లో అండ్‌ చార్మ్‌ తగ్గింది అంటూ ఆ నెటిజన్‌ ఆ కామెంట్ లో చెప్పుకొచ్చాడు. ఆ కామెంట్ కి సమంత కూడా అదిరిపోయే సెటైరికల్ కౌంటర్ ఇచ్చింది. ”నాకు వచ్చిన ఈ అరుదైన వ్యాధి నీకు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా, నేను నెలలు తరబడి తీసుకున వైద్యం నువ్వు తీసుకోకూడదని కోరుకుంటున్న..నీ అందంపెరగడానికి నీపై నేను చూపిస్తున్న ప్రేమ ఇది”.. అంటూ సమంత అతనికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఇప్పుడు ఈ విష‌యంపై ప‌లువురు సినీ ప్రముఖులు కూడా సమంతకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్ స‌మంత‌కు అండగా నిలిచాడు. ఆ నెటిజన్‌ ట్వీట్‌కు స్పందిస్తూ ‘మీరు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం క్లిక్‌ బైట్స్‌ కోసమే ఆలోచిస్తారు. మీకు అందం కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బోమ్మ‌లు ఉన్నాయి.

Varun Dhawan says THIS about teaming up with Samantha for Citadel; Opens up on working with Anees Bazmee | PINKVILLA

ఒక్కసారి సామ్‌ను కలవండి. త‌న తన గ్లో ఏంటో మీకే తెలుస్తుంది’ అని అత‌నికి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చాడు ధావన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్ కు జంట‌గా స‌మంత‌ ‘సిటాడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో కలిసి నటిస్తుంది.