తన బాయ్‌ఫ్రెండ్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నదంటే??

బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లి బాగా ఫేమస్ అయిన సిరి, శ్రీహన్ ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులరైన సిరి, శ్రీహన్ బిగ్‌బాస్‌కి వెళ్లి మరింత ఫేమస్ అయ్యారు. అయితే వీరిద్దరూ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఒకటి కానున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ఇప్పటికే సిరి చాలా సార్లు చెప్పింది. అయితే బిగ్‌బాస్-5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సిరి తన తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్‌తో కలిసి హౌజ్‌లో రచ్చ రచ్చ చేసింది. చీటికీ మాటికీ షణ్ముఖ్ ని హగ్‌లతో, కిస్సులతో ముంచేసేది.

ఇక అప్పటినుంచి ఆడియన్స్‌కి సిరిపై కాస్త నెగిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్ అని బయటికి చెప్పుకుంటుంటే చేయాల్సిన రొమాన్స్ అంత చేసేవారు సిరి, షణ్ముఖ్. దాంతో సోషల్ మీడియాలో వీరిపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. సిరి బయటికి వచ్చిన తరువాత ఆమె ప్రేమికుడు శ్రీహన్ మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. సిరి అంత రచ్చ చేస్తున్నా కూడా హౌజ్‌లో ఉన్నప్పుడు ఆమెకి బయట నుంచి సపోర్ట్ ఇస్తూనే ఉండేవాడు శ్రీహన్. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చాక కొన్ని రోజులు వారిద్దరి మధ్య మాటలు లేవని, ఆ తరువాత కొన్నిరోజులకే శ్రీహన్ తనను అర్థం చేసుకున్నాడని.. అలా వెంటనే కలిసిపోయాం అని సిరి చెప్పుకొచ్చింది.

ఇక ఇటీవలే పూర్తయిన బిగ్‌బాస్-6లో కంటెస్టెంట్‌గా వెళ్లి రూ.40 లక్షల క్యాష్ ని దక్కించుకొని, bb-6లో రన్నర్‌గా నిలిచాడు శ్రీహన్. అయితే సిరికి వచ్చినంత నెగిటివిటీ మాత్రం శ్రీహన్ కి రాకపోయినా అతని ఆటిట్యూడ్ వల్ల, అలానే ఇనాయ, కీర్తిలతో అతను ప్రవర్తించిన తీరు వల్ల కొన్ని విమర్శలను అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీహన్ పై ఎంత నెగిటివ్ ట్రోల్స్‌ వస్తున్నా కూడా అతని గెలిపించడానికి సిరి బయటనుండి బాగానే సపోర్ట్ చేసింది. అంతేకాకుండా ఫ్యామిలీ ఎపిసోడ్ లో హౌస్ లో కి వెళ్లిన సిరి, శ్రీహన్ కి కొన్ని సలహాలు ఇవ్వడమే కాకుండా అతనితో రొమాన్స్ చేసి, అతని పేరుని పచ్చబొట్టు వేపించుకున్నా అని చూపించి మరోసారి వార్తలోకెక్కింది.

ఇక శ్రీహన్ బయటికి వచ్చిన తరువాత కూడా ఇద్దరు కలిసి దిగిన కొన్ని ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా సిరి తన ఇంస్టాగ్రామ్ పేజీలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. దాంట్లో భాగంగా ఒకరు ‘సిరి, శ్రీహన్ పెళ్లి ఎపుడు చేసుకుంటారు, మాకు మీ పెళ్లి చూడాలని ఉంది’ అని అడగారు. దానికి సిరి త్వరలోనే మా ప్రేమ పెళ్లి పీటలెక్కబోతుంది అని సమాధానమిచ్చింది. అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనిబట్టి ఈ ఏడాది వారిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.