`వార‌సుడు`కు విజ‌య్ రెమ్యునరేష‌న్ ఎంతో తెలుసా? బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపే!

ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న చిత్రాల్లో `వ‌రిసు(తెలుగులో వారసుడు)` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా న‌టించింది. శ్రీ‌కాంత్‌, శ్యామ్‌, శరత్‌ కుమార్‌, జయప్రద, ప్ర‌భు, ప్ర‌కాశ్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ‌ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళం తెలుగుతో పాటు హిందీలో విడుదల కాబోతోంది.

అయితే తమిళంలో జనవరి 12న ఈ సినిమా విడుదల కానుండ‌గా. హిందీలో జనవరి 13న, తెలుగులో జనవరి 14న‌ రిలీజ్‌ అవ్వబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో మేక‌ర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ఇదిలా ఉంటే `వారసుడు` సినిమాకు విజయ్ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇన్సైడ్ టాక్ ప్రకారం..వార‌సుడు సినిమా కోసం విజ‌య్ ఏకంగా రూ. 150 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడ‌ట‌. విజయ్ కెరీర్ లోనే అత్యధిక పారితోషకం ఇది. ఇప్పటి వరకూ ఏ సౌత్ ఇండియా నటుడు కూడా ఇంత భారీ మొత్తం తీసుకోలేదు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సైతం రూ. 130 కోట్ల రేంజ్ లోనే రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే విజ‌య్ ముందు బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపే అని చెప్ప‌వ‌చ్చు.