సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘోరపరాజయం పాలైన సినిమాల లిస్ట్ ఇదే!

తెలుగునాట సంక్రాంతి పండగకు వున్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడెక్కడో సెటిలై వున్న తెలుగువారు సంక్రాతి పండగకు తమ ఊళ్లకు చేరుకుంటారు. దాదాపు వారం రోజులపాటు సాధకబాధలను మరచి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇక ఇదే అదనుగా చేసుకొని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగనాడు టాలీవుడ్ నుండి 2 లేదా 3 సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. సంక్రాంతికి సినిమాలను విడుదల చేసి సక్సెస్ సాధిస్తే ఆ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయని మేకర్స్ భావిస్తారు.

కాగా, ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఘోర పరాజయం పాలైన ఘటనలు అనేకం వున్నాయి. అలా ఫ్లాపైన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2019 సంవత్సరం సంక్రాంతి కానుకగా చరణ్ బోయపాటి కాంబోలో ఎన్నో అంచనాలమధ్యన రిలీజైన వినయ విధేయ రామ సినిమా భారీ ఫ్లాప్ సొంతం చేసుకుంది. అదేవిధంగా 2018 సంక్రాంతి కానుకగా పవన్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి రిలీజ్ కాగా ఈ సినిమా కూడా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. అలాగే 2014 సంక్రాంతి కానుకగా విడుదలైన 1 నేనొక్కడినే సినిమా కూడా భారీ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.

ఇకపోతే, 2008 సంవత్సరంలో బాలయ్య – YVS చౌదరి కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఒక్క మగాడు’ సినిమా అయితే బాలయ్య కెరీర్లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఇక 2007 సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభాస్ – VV వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘యోగి’ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక మెగాస్టర్ చిరంజీవి హీరోగా 2004లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అంజి’ సినిమా కూడా భారీ ఫ్లాప్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు హీరోగా 2002 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘టక్కరి దొంగ’ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.