కంచుకోట సీటు కోసం తమ్ముళ్ళ పోరు..దక్కేది ఎవరికి?

గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌ని తట్టుకుని టీడీపీ సత్తా చాటిన స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి కూడా ఒకటి. ఈ స్థానం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ టీడీపీ ఓడిపోయింది కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా 2004 ఎన్నికల్లోనే. ఇంకా అన్నిసార్లు ఇక్కడ టీడీపే హవా నడిచింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం ఉండి నుంచి టీడీపీ తరుపున మంతెన రామరాజు గెలిచారు. అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది.

కాకపోతే ఈ సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు(కలవపూడి శివ) సైతం ఉండి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఉండి సీటు వేటుకూరిదే. 2009, 2014 ఎన్నికల్లో ఆయనే గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు..శివని నర్సాపురం ఎంపీగా పంపించి..రామరాజుని ఉండి లో నిలబెట్టారు. ఇక తక్కువ మెజారిటీతో శివ ఓడిపోగా, రామరాజు విజయం సాధించారు.

అయితే శివ ఇప్పుడు మళ్ళీ తన సొంత స్థానానికి వచ్చేశారు. అటు ఎలాగో నరసాపురం ఎంపీ సీటు దక్కేలా లేదు. ఎందుకంటే అది పొత్తులో జనసేనకు వెళ్ళేలా ఉంది. దీంతో శివ మళ్ళీ ఉండి సీటు కోసం ట్రై చేస్తున్నారు. అటు రామరాజు సైతం ఉండి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దీంతో ఇరువురు మధ్య సీటు కోసం పోరు నడుస్తోంది. దీనిపై చంద్రబాబు కూడా ఆరా తీసి అందరూ కలిసి పనిచేయాలని, ముందు టీడీపీని బలోపేతం చేస్తే..సమయం బట్టి సీటు కేటాయిస్తానని అంటున్నారు. చూడాలి మరి చివరికి ఉండి ఎవరికి దక్కుతుందో.