నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల జాతర.. ఇక ఓటీటీ ల‌వ‌ర్స్‌కి పండ‌గే పండ‌గ‌!

కరోనా పుణ్యమా అని ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ప్రేక్ష‌కులు థియేటర్‌కు వెళ్ల‌డం కంటే ఇంట్లోనే కూర్చుని సినిమా చూడ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా జనాలను అట్రాక్‌ చేయడానికి ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలతో సందడి చేస్తున్నారు. అయితే గ‌త మూడేళ్ల నుంచి దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా చెలామణి అవుతున్న నెట్‌ఫ్లిక్స్ కి తెలుగులో డిమాండ్ బాగా త‌క్కువ‌.

ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్‌లో అత్య‌ధికంగా హిందీ, ఇంగ్లీష్‌ సినిమాలే విడుదల అవుతుంటాయి. అందుకే తెలుగు వారు నెట్‌ఫ్లిక్స్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు సినిమాల జాత‌ర జ‌ర‌గ‌బోతోంది. తాజాగా ఈ సంస్థ తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్‌ చేసేందుకు వరుసగా తెలుగు సినిమాలను ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 తెలుగు సినిమా డిజిట‌ల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసి ఓటీటీ ల‌వ‌ర్స్ కి పండ‌గ లాంటి న్యూస్‌ను వెల్ల‌డించింది.

ఈ లిస్ట్ లో స్టార్ హీరోల సినిమాల‌తో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. వాటిని ఓసారి ప‌రిశీలిస్తే.. భోళా శంకర్‌, దసరా, అమిగోస్‌, సందీప్‌ కిషన్ హీరోగా తెర‌కెక్కుతున్న బడ్డి, ధమాకా, కార్తికేయ8, వరుణ్‌ తేజ్ 12, టిల్లు స్క్వేర్‌, వైష్ణవ్‌ తేజ్ 4, బుట్ట బొమ్మ, ఎస్‌ఎస్‌ఎమ్‌బి28, విరూపాక్ష, నాగశౌర్య 24, మీటర్‌, 18పేజీస్‌, అనుష్క-నవీన్‌ పొలిశెట్టి మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది.