తెలంగాణ శకుంతల జీవితంలో జరిగిన ఆ సంఘటన గురించి తెలిస్తే!!

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది తెలంగాణ శకుంతల. ఈ నటి పూర్తి పేరు కడియాల శకుంతల. మహారాష్ట్ర ఈమె స్వస్థలం. అక్కడ పుట్టినా తెలంగాణ యాస బాగా వంట బట్టించుకుంది. ఆ యాసతోనే తెలుగులో సుమారు 250 సినిమాల్లో నటించింది. విలన్‌గా మాత్రమే కాకుండా కామెడీ టచ్ ఉన్న పాత్రలోనూ అద్భుతంగా నటించిన ఈ యాక్ట్రెస్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. శకుంతల సినిమాల్లోకి రాకముందు రంగస్థలం నటిగా కొనసాగింది. తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

1979లో డైరెక్టర్ గౌతమ్ ఘోష్ డైరెక్ట్ చేసిన మా భూమి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆపై నువ్వు నేను, ఒక్కడు, లక్ష్మీ సినిమాల్లో ఎంతో బాగా నటించి స్టార్ ఆర్టిస్ట్‌గా మారింది. 1951 లో పుట్టిన తెలంగాణ శకుంతల 2014 జూన్ 14న గుండెపోటుతో మరణించింది. అప్పటికి ఆమెకు 63 ఏళ్ల వయసు ఉంది. పైకి బాగా నవ్వుతూ ఎంతో హ్యాపీగా కనిపించే శకుంతల జీవితంలో చాలా విషాదాలు ఉన్నాయి. ఆ విషయం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈమె తన జీవితంలో కొన్ని యాక్సిడెంట్ వల్ల చాలా నరకం అనుభవించింది.

ముఖ్యంగా తన తండ్రి తన చిన్న వయసులోనే చనిపోయాడు దీనివల్ల ఆమె ఎన్నో ఆర్థిక బాధలను పడింది కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న వయసులోనే నటనను వృత్తిగా ఎంచుకోవలసి వచ్చింది. ఈమెనే రేయింబవళ్లు యాక్టింగ్ చేస్తూ తన అక్క చెల్లెళ్ల బాగోగులు చూసుకుంది. వయసులో చిన్నాయన తన సోదరీమణులకు ఈమె తన సొంత డబ్బులతో పెళ్లి చేసింది. తర్వాత తాను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇకపోతే శకుంతల ఒక ప్రమాదంలో తన రెండు కాళ్లను విరగొట్టుకుంది. దాంతో తాను ఇకపై నటించలేనేమో అని చాలా బాధపడింది. మెల్లిమెల్లిగా ఆ ప్రమాదం నుంచి కోరుకుంటున్న సమయంలోనే ఆమెకు హార్ట్ ఎటాక్ రావడం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం జరిగింది.