దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు జనాలు . చిన్న పెద్ద ఏమీ తేడా లేకుండా అందరూ చాలా సంతోషంగా గ్రాండ్గా సంక్రాంతి పండుగను .. తమ కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకుంటున్నారు . కాగా స్టార్ సెలబ్రెటీస్ సైతం వాళ్లు ఎలా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారో… సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఘట్టమనేని ఆడపడుచు సితార పాప ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి.
సితార పాప ట్రెడిషనల్ పద్ధతిలో రెడీ అయిన విధానం మహేష్ బాబు అభిమానులకు తెగ నచ్చేసింది. అందుకే మహాలక్ష్మి లా ఉన్న సితార పాప ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . కాగా ఈ సంక్రాంతి సితార పాపకు చాలా స్పెషల్ . మొదటి నుంచి తెలుగు పండుగలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే సితార.. ఈ సంక్రాంతి పండుగ నుంచి నానమ్మ తాత జ్ఞాపకార్థం ప్రతి సంక్రాంతికి 100 మంది పేద పిల్లలకు బట్టల పంపిణీ చేయడానికి నిర్ణయించుకుందట .
ఇప్పటికే సితార పాప తన నాన్న పేరు చెప్పి పలువురు జనాలకు సహాయం చేస్తుంది . ఈ క్రమంలోని ఇప్పుడు ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్న సితార పాపను చూసి మహేష్ బాబు అభిమానులు చాలా సంబరపడుతున్నారు .తండ్రికి మించిన కూతురు అంటూ పొగిడేస్తున్నారు. ప్రజెంట్ మహేశ్ బాబు స్టార్ దైరెక్టర్ త్రివిక్రమ్ స్రినీ వాస్ రావు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు..!!
View this post on Instagram