బాలయ్య సినిమాకి ఫేక్ కలెక్షన్స్..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా 2021 లో డిసెంబర్ నెలలో విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ని తెచ్చుకుంది. ఈ సినిమాని అప్పట్లో నార్త్ ప్రేక్షకులు చూసి ఎందుకో విపరీతమైన ఆసక్తి కనబరిచారు.కానీ ఎందుకో ఏమో ఆ సినిమా విడుదలైన తర్వాత ఏడాదికి హిందీలో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు. హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. విలన్ గా శ్రీకాంత్ నటించారు.అయితే హిందుత్వా జెండాతో ఉన్న కాంతారా, కార్తికేయ-2 వంటి సినిమాల బాటలోనే ఈ సినిమా కూడా నార్త్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు.

Nandamuri Balakrishna's 'Akhanda' Title Track Gets Over 3lakh views
అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే కలెక్షన్లు కూడా దాదాపుగా రూ.7 కోట్లకు పైగా క్రాస్ వచ్చాయని అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఇది నిజం కాదని కొందరు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కావాలనే ఆ కలెక్షన్స్ ని పెంచి చూపిస్తున్నారని వాదనలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి… ఎందుకంటే శనివారం రోజున టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే నార్త్ లో ఉన్న దాదాపు ప్రధాన నగరాలు అన్నిటిలో కూడా బుకింగ్ పెద్దగా నమోదు కానట్లు తెలుస్తోంది. ఐదు నుంచి పది పర్సెంటేజ్ ఆకీపేన్స్ ని కూడా నమోదు చేసుకున్నట్లు కనిపించలేదట.

అలాంటి ఈ చిత్రం మొదటి రోజు రూ .7 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది అంటే ఎలా నమ్మడం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నార్త్ లో బెస్ట్ లో ఉన్న బాయ్ కాట్ గ్యాంగ్ అంతా కూడా అఖండ సినిమా మీద ఆసక్తి చూపిస్తోంది. హిందుత్వం అజెండాతో తెరకెక్కించిన విచిత్రం అక్కడ వారికి బాగా నచ్చేయడంతో వారు కాస్త కలెక్షన్లను ఫేక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్లను వైరల్ చేస్తున్నట్లు సమాచారం.