ఆ పరిస్థితి వస్తే ఎవరైనా రిటైడ్ కావాల్సిందే చిరంజీవి హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య ఈ సినిమా కోసం మెగా అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో చిరంజీవి మాస్ క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు. ఇక ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగ ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఫ్యాన్స్ ని కూడా ఈ సినిమా మెప్పించలేదు అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా నుంచి విడుదలైన టీజర్, టైటిల్ పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు కూడా భారీగానే స్పందన వచ్చింది. ఇక తాజాగా టైటిల్ సాంగ్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండీగా నిలుస్తోంది. ఈ సినిమా టీం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయక ఈ ప్రెస్ మీట్ లో వీరయ్య టీం ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

చిరంజీవి రవితేజ ఇద్దరు కూడా ఒకే స్టేజిపై సందడి చేశారు. ఇక మీడియా అడిగిన ప్రశ్నలకు చిరంజీవి రవితేజ సమాధానాలు తెలియజేయడం జరిగింది.. ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా కోసం అందరం కష్టపడి పని చేశాము ..అందరూ కూడా ప్రేమని పంచారు డైరెక్టర్ బాబి నన్ను నేను కూడా ఊహించని విధంగా చూపించారాని తెలిపారు. ఇక అక్కడున్న ఒకరు.. చిరంజీవి అయ్యుండి వర్షంలో తడిసి షూటింగ్లో పాల్గొనాల్సి ఉందా.. అంత మంచులో కూడా డాన్స్ చేయవలసి ఉంటుందా నైట్ కష్టపడి పని చేయవలసి ఉంటుందా.. అనే ప్రశ్న అడగగా.. అందుకు చిరంజీవి కచ్చితంగా చేయాల్సిందే.. అలా చేయని రోజున రిటైర్డ్ అవ్వడం మంచిదని తెలిపారు.