సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.అయితే ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ చాలామంది పాపులర్ అవ్వడమే కాకుండా హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా చాలా సినిమాలలో నటించిన గుర్తింపు రాకుండా ఒక్క సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో వారే లిరీషా కూడా ఒకరు. లిరిషా అనే పేరు చెప్పగానే వకీల్ సాబ్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్లు నటించిన సూపర్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న ఈమెను ఇట్టే గుర్తు పడతారు.
లిరిషా కేవలం వకీల్ సాబ్ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయం కాలేదు. ఈమె సినీ చరిత్ర రెండు దశాబ్దాల కాలం నుంచి మొదలైందని చెప్పవచ్చు. కామెడీ యాక్టర్లలో బ్రహ్మానందం, వేణుమాధవ్ ,ఆలీ వంటి తదితర కామెడియన్లకు భార్యగా నటించింది. ఎంతోమందిలో లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో ఈమె కూడా ఒకరట. నటి లిరిషా ఒకానొక సమయంలో నారాయణమూర్తితో కలిసి ఒక సన్నివేశంలో నటించిందట. హీరో వేణుకు చెల్లెలు గా క్యారెక్టర్లు కూడా వేసిందట. అయితే తాను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో సినిమాలలో నటిస్తుంటే బ్రహ్మానందం పొగిడే వారిని తెలిపింది.
తన భర్త తనను సినిమాలలో నటించమని ప్రోత్సహిస్తూ ఉంటారని తెలిపింది. ఇక వేణుమాధవ్ ఆరోగ్యం బాగా లేనప్పుడు తను చాలా బాధపడ్డానని అయితే వేణుమాధవ్ ఇంటికి వెళ్లి పలకరించే అంత చనువు మాత్రం లేదని సినీ ఇండస్ట్రీలో తనతో ఆలీ, బ్రహ్మానందం ఇప్పటికీ ప్రేమతో పలకరిస్తూ ఉంటారని తెలిపింది. ప్రస్తుతం తను ఒక చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నానని ఆ సినిమా మధ్యలో ఆగిపోయిందని ఒకవేళ ఆ సినిమా విడుదల అయ్యుంటే చెన్నైలో సెటిల్ అయ్యే దానిని తెలిపింది లిరిషా.