బాలయ్య-పవన్ ‘పోలిటికల్’ షో..వైసీపీ రెస్పాన్స్..!

ఏపీ రాజకీయాల్లో ఊహించని కాంబినేషన్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ దాదాపు పొత్తుకు రెడీ అయిపోయినట్లే.ఈ రెండు పార్టీల పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్ ఉంటుందని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై వైసీపీకి కూడా అవగాహన ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి వైసీపీకి మేలు కలిగింది.

దీంతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. అందుకే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకోకుండా ఉండటానికి..పరోక్షంగా పవన్‌ని రెచ్చగొట్టేలా దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని, ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదంటూ వైసీపీ నేతలు మాట్లాడుతూ వచ్చారు. వారు ఎంత రెచ్చగొటిన పవన్ ప్లాన్..పవన్‌కు ఉంది. ఇక ఇప్పుడు పొత్తు దిశగా వెళుతుంటే..జగన్ దమ్మున్న నాయకుడు అని ఒక్కడే నిలబడతారని, ఎంతమంది కలిసొచ్చిన తమకు నష్టం లేదని అంటున్నారు. అంటే జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారన్ఈ, ప్రజల్లో సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా ఆహా అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ గెస్ట్ గా వచ్చారు. బాలయ్య-పవన్ కాంబినేషన్‌తో అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. దీనిపై కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది. ఇక పవన్ కోసమే కాచుకుని కూర్చున్న మాజీ మంత్రి పేర్ని నాని వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి.. బావతో తిరిగిన పవన్.. బామ్మర్దితో వెళ్తే.. తప్పేం ఉందని, అది కూడా డబ్బులు తీసుకొని చేసే షో అని, దానికి ముందే స్క్రిప్ట్ రాసిస్తారనీ చెప్పుకొచ్చారు. అన్ స్టాపబుల్ వేదికగా ఎన్టీఆర్ మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, తన బావ చేసిన తప్పులను బాలకృష్ణ కప్పిపుచ్చుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇలా  షో పై కూడా పేర్ని కామెంట్ చేశారు.