పవన్ సత్యాగ్రహి అందుకే ఆగిపోయింది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..?

గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏ.ఎమ్ రత్నం, పవన్ కాంబినేషన్లో సత్యాగ్రహం అనే సినిమాని ప్రకటించారు. ఇక 2003లో పవన్ దర్శకత్వంలో ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని రత్నం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని 2003లో అన్నపూర్ణ స్టూడియోలో భారీగానే ఓపెన్ చేశారట. ముఖ్యంగా దాసరి గారు క్లాప్ కొట్టగా ,వెంకటేష్ కెమెరా ఆన్ చేశారని వివి వినాయక్ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారని తెలిపారు. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమాను పక్కన పెట్టేయలసి వచ్చిందని తాజాగా నిర్మాత తెలిపారు.వాటి గురించి తెలుసుకుందాం.

Satyagrahi : ఆగిపోయిన సినిమాపై పవన్ ట్వీట్ వైరల్ | Satyagrahi
అయితే ఈ సినిమా ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటోందని ఈ సినిమా చేసి ఉంటే చాలా గొప్ప సినిమా అయ్యేదని అభిమానులు అప్పుడప్పుడు కామెంట్లు తెలియజేస్తూ ఉంటారని నిర్మాత రత్నం తెలియజేస్తున్నారు. స్క్రిప్ట్ సరిగ్గా లేదని బడ్జెట్ ఎక్కువైందని ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకున్నారు. కానీ తాజాగా ఈ విషయంపై నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. జాని చిత్రం రిజల్ట్ చూశాక పవన్ కళ్యాణ్ చాలా నిరుత్సాహపడ్డారు.. ఆయన డైరెక్షన్స్ స్కిల్స్ తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయారని చాలా బాధపడ్డారట.. దీంతో సత్యాగ్రహి చిత్రం పైన మా డబ్బుని రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు దాంతో ఆ ప్రాజెక్టుని ఆపేసామని తెలిపారు.

ఆమధ్య పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ఒక ట్విట్ సోషల్ మీడియాలో చేయగా వైరల్ గా మారింది. ఆ ట్వీట్లో ఆయన లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ సమకాలిన కాలంలో ఎమర్జెన్సీ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన రాజకీయ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు.. ఇక గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో ఈ సినిమా మరింత పాపులర్ అయిందని తెలిపారు.