కృష్ణ సినిమాల్లోకి రావ‌డానికి ముఖ్య కార‌ణం ఎవ‌రు? అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో మంగ‌ళ‌వారం తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు. ఆయన మరణ వార్త అటు కుటుంబ సభ్యులను, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. నేటి సాయంత్రం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబోతున్నారు.

ఇకపోతే కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాల్లోకి కృష్ణ రావడానికి ప్రధాన కారణం ఎవరు అన్న విషయం కూడా నెట్టింట హా్‌ టాపిక్ గా మారింది. అసలు ఇంతకీ కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణం ఎవరో తెలుసా? అక్కినేని నాగేశ్వరరావు. అవును మీరు విన్నది నిజమే.

ఏలూరులో సిఆర్ రెడ్డి కళాశాలలో కృష్ణ డిగ్రీ చ‌దువుతున్న రోజుల్లో.. ఒక కార్యక్రమం నిమిత్తం నాగేశ్వరరావు కాలేజీకి స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యారు. అప్పటికే ఆయ‌న దాదాపు 60 సినిమాలు చేసి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. అయితే కృష్ణ తమ కాలేజీలో నాగేశ్వరరావుకు ఉన్నటువంటి అభిమానులు చూసి తాను కూడా ఎలాగైనా హీరో అవ్వాలని, ఆయన మాదిరి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవాలని డిసైడ్ అయ్యారట.

ఈ క్రమంలోనే తండ్రితో విషయం చెప్పి మద్రాస్ కు వచ్చారట. అయితే కృష్ణకు అంత త్వరగా అవకాశాలు రాలేదు. ఎన్నో కష్టాలను పడ్డారట. ఇక మొదట్లో నాటకాలు వేస్తూ న‌ట‌న పై పట్టు సాధించిన కృష్ణ.. ఆ తర్వాత ప‌లు సినిమాల్లో చిన్న చిన్న పాత్రను పోషించారు. ఆపై `తేనె మనసులు` సినిమాతో హీరోగా మారి.. అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.