దట్ ఈజ్ అనసూయ..అన్నంత పని చేసిందిగా..ట్రోలర్స్ మైండ్ బ్లాక్..!

లైగర్‌ సినిమా తర్వాత నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ ఇక ఇప్పుడు మళ్లీ వార్తలు లోకి ఎక్కింది. లైగర్ సినిమా విడుదల టైమ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆ టైమ్‌లో అనసూయ తనపై అసభ్యకరమైన కామెంట్‌లు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు నిన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన పందిరి రామ వెంకటరాజు అనేే వ్యక్తిని అనసూయ కేసు ప్రకారం అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది.

Anasuya Bharadwaj: Times when the actress-TV personality shut down trolls  and voiced against age-shaming | The Times of India

ఆ వ్యక్తి మీద 354(A)(D), 559 ఐపీసీ సెక్షన్ 6767(A) ఐటీ ఆక్ట్ 2000, 2018 చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఖాతాలలో టాలీవుడ్‌కు సంబంధించిన హీరోయిన్స్ ఫోటోలు పెట్టి ఆసభ్యకరమైన కామెంట్లు రాస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అనసూయ ఫోటోలను కూడా వాటిల్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

anasuya new

ఆ వ్యక్తికి 257 పైగా ట్విట్టర్ అకౌంట్ లు ఉన్నట్టు గుర్తించారు. ఆ అకౌంట్‌లో హీరోయిన్లకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు పెడుతున్నట్లు పోలీసు లు చెప్తున్నారు. సదురు ఆ వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. గతంలో దుబాయ్ వెళ్లి అక్కడ ప్లంబింగ్ వర్క్ చేసి కొంతకాలం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కి తిరిగి వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Anasuya: అనసూయ మామూలుది కాదు.. అనుకున్నది సాధించిందిగా - NTV Telugu

తరవాత సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోయిన్లు, యాంకర్స్ ను టార్గెట్ చేస్తూ వారికి సంబంధించిన హాట్ ఫోటోలను సేకరించి ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా పోలీసులుు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు.