ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎక్కువగా కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమాలను తెరకెక్కించే ఈయన తాజాగా జబర్దస్త్ కి దీటుగా ఓటీటీ సంస్థ ఆహా.. తాజాగా “కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ” పేరిట ఒక కామెడీ షో ని ప్రారంభించింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తుండగా.. హోస్ట్ లుగా సుడిగాలి సుదీర్ తో పాటు దీపిక పిల్లి చేస్తున్నారు . తాజాగా ఈ షో మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ముక్కు అవినాష్ వంటి కంటెస్టెంట్లు స్కిట్స్ లో తమ మార్క్ కామెడీ లో అలరించినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా ముక్కు అవినాష్ , సద్దాం కామెడీ ట్రాక్ అయితే హైలైట్ అనిపించేలా ఉంది. పనిలో పనిగా హోస్ట్ సుడిగాలి సుదీర్ ని కూడా ఆడేసుకున్నారు కంటెస్టెంట్లు. ఇదే క్రమంలో జడ్జ్ అనిల్ రావిపూడి మరో హోస్ట్ అయిన దీపికా పిల్లికి ముద్దు పెట్టడం ఇప్పుడు హైలైట్ గా మారింది. అంతే కాదు ప్రోమో మొత్తంలో ఇదే హైలైట్ అవ్వడం గమనార్హం. అయితే ఏ సందర్భంలో జరిగింది అనేది ఫుల్ ఎపిసోడ్ వస్తే కానీ స్పష్టత రాదు. ప్రస్తుతానికైతే ప్రోమో వైరల్ అవుతూ ఉండగా అనిల్ రావిపూడి లో ఈ సెగలు కూడా ఉన్నాయా..? ఏకంగా అమ్మాయితో ముద్దు పెడుతూ రొమాన్స్ కి దిగుతున్నాడే.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు ఆయనపై ఇప్పుడు ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.
ఏది ఏమైనా ఆహా ఏర్పాటు చేసిన ఈ షోపై మరింత అంచనాలు పెంచడానికి ఇలా చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మొత్తానికైతే ఆహా అనుకున్న విధంగా సక్సెస్ అవుతుందా లేదా అనేది మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.