తెలుగు సినీ సంగీత దిగ్గజం శ్రీ స్వర్గీయ బాల సుబ్రహ్మణ్యం గురించి చెప్పుకోవడానికి పదాలు సరిపోవంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఆయన హయాంలో సింగర్ అయినటువంటి అందాల బొమ్మ సునీత పేరు కూడా తెలియని తెలుగు ప్రేక్షకులకు వుండరు. అందమైన తన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను పాడి తెలుగు ప్రక్షకులనే కాకుండా మిగతా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది సునీత. ఆమెలో వున్న మరో ప్రత్యేకత ఏమంటే, పాటను ఎంత తీయగా పాడుతుందో అంతే బాగా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేయడం.
అయితే కొన్ని వేల పాటలు, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన సునీత.. వ్యక్తిగత జీవితం మాత్రం అంత ఆశాజనకంగా సాగలేదు. సునీతకి చిన్న వయసులో వివాహం కాగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల తరువాత ఆమె మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది. తర్వాత పిల్లలను పెద్ద చేయటంలో ప్రముఖ పాత్ర పోషించింది. వారిని పెద్ద చేసిన తరువాత ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకొని చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తోంది.
ఇక సునీత సంగీత ప్రపంచంలో సింగర్ బాలు గారి పాత్ర ప్రత్యేకమైనది. అవును, సునీత కి బాలు గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి చాలామందికి తెలియదు. పాటల పరంగా ఎక్స్ప్రెషన్స్ పలికించి పాడటంలో బాలు గారి తరువాత సింగర్ సునీతకే సాధ్యపడింది. వీరిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. సునీతకు బాలు గారు అంటే చాలా ఇష్టం.. అలాగే దానికి మించిన గౌరవం కూడాను. కాగా వాళ్లు నిజంగానే బంధువులు అన్న విషయం చాలామందికి తెలియదు. బాలు గారు సునీతకు మావయ్య అవుతారు.