అను ఇమ్మానుయేల్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ అమ్మడు మొదటి సినిమాతో క్లాసికల్ నాచురల్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత నాగచైతన్య, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది .అయితే అవకాశాలు వచ్చినా కానీ లక్ కలిసి రాకపోవడంతో అమ్మడు జనాల దృష్టికి ఎక్కలేదు .
ఈ క్రమంలోనే సినిమాలు భారీ స్థాయిలో డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాయి . కాగా ప్రజెంట్ అను ఇమ్మానుయేల్ హీరోయిన్గా చేస్తున్న సినిమా “ఊర్వశివో రాక్షసివో”. ఈ సినిమాలో అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమా హిట్ అవ్వడం అల్లు శిరీష్ కి , అను కి చాలా కీలకం. ఈ సినిమా కానీ హిట్టు కాకపోతే వీళ్ళని ఇక ఇండస్ట్రీలో పట్టించుకునే దిక్కే ఉండరు .
ఈ క్రమంలోనే సినిమాలో హాట్ సీన్స్ తో పాటు ఘాటైన లిప్ లాక్ లు కూడా చేసింది . దీనికి సంబంధించిన పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. కాగా ఈ ఘాటు లిప్ లాక్ ఎఫెక్ట్ కారణంగా అను టాలీవుడ్ బడా హీరో సినిమాలో అవకాశం దక్కించుకుంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఎస్ టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో అను సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెకండ్ హీరోయిన్ రోల్ లో మహేష్ బాబు మరదలుగా నటించాల్సి ఉంటుంది. ఈ పాత్రకు సైలెంట్ లుక్స్ తో కనిపించే అమ్మాయి అయితే బాగుంటుంది అంటూ త్రివిక్రమ్ ఇన్నాళ్లు ట్రై చేశారట . ఫైనల్గా అను సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . ఊర్వశివో రాషశివో సినిమా రిలీజ్ అవ్వకముందే అను…మహేష్ బాబు లాంటి బడా హీరో సినిమాలో అవకాశం అందుకుంది అంటూ వార్తలు రావడమే గొప్ప విషయం అంటున్నారు ఫాన్స్ .