శోభిత ధూళిపాల.. మేజర్, గూఢచారి వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత రీసెంట్ గా మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పోనియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న శోభిత ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో తో ప్రేమాయణం నడుపుతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
అయితే శోభిత తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా పక్కన వరుడితో చేతిలో చెయ్యేసి పెళ్లికూతురుల అందంగా ముస్తాబయింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా సోబితా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్ అని క్యాప్షన్ ఇవ్వడంతో నిజంగానే శోభితకు పెళ్లయిపోయిందంటూ అందరూ అనుకున్నారు.
ఈ ఫోటోలు చూసినవారు ఎవరైనా సరే అదే నిజమనుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే? అయితే ఈ ఫోటోలు పెళ్లికి సంబంధించి ఓ యాడ్ షూట్లో భాగంగా తీశారట. ఈ ఫోటోలు చూసిన శోభిత అభిమానులు ఒక్కక్షణం తమ గుండాగి పోయినంత పనైందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు విషయం తెలిసిన వారంతా అవాక్కైపోతున్నారు. ప్రస్తుతం శోభిత షేర్ చేసిన వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.