సినీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం ..రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు . హీరో గా ఉన్న వాడు స్టార్ హీరో అవ్వడం.. హీరోగా ఉన్న స్టార్..జీరో అవ్వడం క్షణాల్లో జరిగిపోతుంది . ఒకే ఒక్క సినిమా హిట్ అయితే ఫోటోలు.. సెల్ఫీలు ..ఆటోగ్రాఫర్లు అంటూ ఎగబడే జనాలే ..అదే సినిమా ఫ్లాప్ అయితే పక్కన పోతున్న కానీ పట్టించుకోరు. అలా సినీ ఇండస్ట్రీ మనిషిని దిగజార్చేస్తుంది.
అలాంటి పొజిషన్లోనే ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ . మనకు తెలిసిందే జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన నితిన్ మొదటి సినిమాలో చాలా కూల్ గా సైలెంట్ లుక్స్ తో ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతైనా తెగించే వ్యక్తిగా ..మరోవైపు అమ్మ మాట వింటూ బుద్ధిగా నడుచుకునే కొడుకుగా రెండు షేడ్స్ లో అట్రాక్టివ్ గా కనిపించాడు. కాగా ఈ సినిమా తేజ డైరెక్షన్లో తెరకెక్కింది. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది .
కాగా ఆ తర్వాత కూడా తనదైన స్టైల్ లో సినిమాలు చూస్ చేసుకుంటూ తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథలను సెలెక్ట్ చేసుకున్నాడు . అయితే కెరియర్ పిక్స్ కి వెళ్లిన టైం లోనే నితిన్ మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి మాస్ మాటలు మాట్లాడుతూ లుక్స్ లో కనిపించడానికి ట్రై చేసి కెరియర్లో బిగ్గెస్ట్ తప్పు చేశాడు. అంతేకాదు సాఫీగా సాగిపోతుంది నితిన్ కెరియర్ అక్కడే మలుపు తిరిగింది.
ఇక తర్వాత నితిన్ ప్రయోగాత్మక సినిమాలకు తెరలేపి తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాని సూట్ అవ్వని సినిమాలను సెలెక్ట్ చేసుకుని బిగ్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ మనం చూసుకుంటే నితిన్ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి హిట్టు కొట్టిన సినిమాల కన్నా డిజాస్టర్ గా మారిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు రీసెంట్గా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది దీంతో నితిన్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఇలాగే కొనసాగితే నితిన్ కెరియర్ క్లోజ్ అయినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.