టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు హీరో అడవి శేషు. ఇక తను నటించిన సినిమాలు అన్నీ కూడా టాప్ రేటింగ్ పొందుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా అడవి శేషు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రమే hit -2. ఈ సినిమా మొదటి భాగంలో హీరో విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. హీట్ -2 సినిమాని అడవి శేషుతో తెరకెక్కించారు డైరెక్టర్ శైలెస్ కొలను.
అడవి శేషు అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్డేట్ విడుదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అలాంటి వారి కోసం తాజాగా కొన్ని నిమిషాల ముందు హీట్ -2 సినిమా టీజర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా నిర్మాతగా హీరో నాని వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా స్టోరీ కూడా విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తున్నది ఇక హీరోయిన్ పాత్రను కూడా తాజాగా చిత్ర బృందం రిలీవ్ చేయడం జరిగింది.
ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. ఇందులో అడవి శేషు ఒక విభిన్నమైన పోలీస్ పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. మొదట రాహు రమేష్ ,అడవి శేషు మధ్య సంభాషణతో ఈ సినిమా టీజర్ మొదలవుతుంది. ఈ సినిమా మొత్తం విశాఖ ప్రాంతంలోని క్రైమ్ సన్నివేశాల చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుగా ఈ టీజర్ ను చూస్తే మనకు అర్థమవుతొంది. మరొక నటుడు పోసాని కూడా ఇందులో జర్నలిస్టు పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఇక టీజర్ చివరిలో విలన్ చెప్పే డైలాగ్ అతి భయంకరంగా ఉందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలుగా చేసి పడేయడంతో ఈ సినిమా మరింత ఉత్కంఠంగా ఉండబోతోందని చెప్పవచ్చు.