ఒకప్పటి ప్రముఖ నటి అంజలా ఝవేరి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. బుల్లితెర ద్వారా అయినా ఈ ముద్దుగుమ్మ పరిచయమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఈ తార ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి వంటి చాలా క్లాసిక్ సినిమాల్లో నటించింది. ‘ప్రేమించుకుందాం రా’ మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్గా కనిపించింది. తన అందం అభినయంతో ఫస్ట్ సినిమాతోనే చాలా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత టాలీవుడ్లో వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది.
అంజనా నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ట్ హీరోలతో కూడా నటించించింది. ఎన్ని సినిమాలలో నటించినప్పటికీ బాలయ్యతో కలిసిన నటించిన సమరసింహారెడ్డి సినిమాకి వచ్చినంత క్రేజ్ మరే సినిమాకి రాలేదు. ఈ సినిమాతో ఆమె రేంజ్ మరో లెవెల్‌కి పెరిగిపోయింది. సమరసింహ రెడ్డి సినిమాలో రాయలసీమ పౌరుషం ఉన్న అమ్మాయి పాత్రలో రెచ్చిపోయింది. ఇలా తన టాలీవుడ్ కెరీర్ సాఫీగా కొనసాగితున్న సమయంలో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అక్కడ హిందూల్ హిమాలయ అనే సినిమాలో నటించింది. కానీ అది పరాజయం పాలైంది. ఆ తరువాత ఆమెకి ఆఫర్స్ రాలేదు. దీంతో అంజనా సినీ కెరీర్ ముగిసిపోయింది.
ఇక అదే టైమ్‌లో అంజనా తన కంటే ఏడేళ్లు చిన్నవాడైన తరుణ్ రాజ్ అరోరాతో ప్రేమలో పడి, అతన్ని పెళ్లి చేసుకుంది. తరుణ్ రాజ్‌కి తమిళంలో ఒక స్టైలిష్ విలన్‌గా మంచి పేరు ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తరుణ్ రాజ్ ‘ఖైదీ నం.150’ సినిమాతో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆరేళ్ల క్రితం అంజలా, తరుణ్ వివాహం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరికి పిల్లలు పుట్టలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అంజలా కూడా త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందట.