ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్బాస్ సీజన్ 6 షోను ఇతర ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతోంది. కాగా ఈ షోలో ఎలిమినేషన్స్, రెమ్యునరేషన్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కాగా ప్రతి వారం హౌజ్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తున్నారు. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను చూసి బీబీ హౌస్ మెంబర్స్ తీవ్ర బాధని వ్యక్తం చేయడం ప్రతిసారి కనిపించేదే. ఇక నిన్న జరిగిన 10th వీక్ ఎలిమినేషన్లో బాల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న బాలాదిత్య హౌజ్ నుంచి బయటకి వచ్చేశాడు. అయితే బాలాదిత్య ఎలిమినేట్ అయ్యాడనే నిజాన్ని అటు ప్రేక్షకులు ఇటు కంటెస్టెంట్స్ తట్టుకోలేకపోతున్నారు.
టాప్ 5లో ఒకడిగా ఉంటాడని అనుకున్న బాలాదిత్య పదవ వారమే బయటకి రావడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక నిన్నటితో బాలాదిత్య బయటికి వచ్చినట్లు కన్ఫర్మ్ అయింది. దాంతో అంతా బాలాదిత్య ఈ 10 వారాలకి బిగ్బాస్ నుంచి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడా అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. బాలాదిత్య వారానికి రు.25 చొప్పున 10 వారాలకి 6.5 లక్షల రూపాయలు తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం. రూ.6.5 లక్షలు అనేది మంచి ఆదాయమే అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే బిగ్బాస్ కంటెస్టెంట్స్ మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.
హీరో, బాల నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న బాలాదిత్య వ్యక్తిగతంగా కూడా అలాంటి పేరే సంపాదించాడు. అలాంటి బాలాదిత్యకు ప్రేక్షకధారణ గట్టిగానే ఉంది. అందుకే ఇన్ని వారాలు ఓట్లు వేసి కాపాడారు. కానీ గత రెండు వారాలుగా ఇతని ఆట తీరు పెద్దగా ప్రేక్షకులకు మెప్పించలేకపోయింది. దాంతో అప్పటివరకు సపోర్ట్ చేసిన జనాలే 10 వీక్లో హౌజ్ నుంచి బయటికి తీసుకొచ్చేశారు. బాలాదిత్య ఎలిమినేషనల్ బిబి హౌస్ లో అందరికి భయాన్ని కలిగించింది. అసలు ఎపుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది హౌస్ మెంబర్స్ కే కాదు ఓట్లు వేసే ఆడియన్స్ కి తెలియనివ్వడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయి షాక్ చేస్తారో చూడాలి.