మహేష్ త్రివిక్రమ్ బిజినెస్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లు వచ్చిన చిత్రాలలో అతడు, ఖలేజా వంటి సినిమాలు విడుదలై పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాలు చూస్తూ ఇప్పటికి ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రనికీ సంబంధించి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

SSMB 28 (2023) - IMDb
నాన్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.75 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందని.. ఇక బిజినెస్ పరంగా రూ.125 కోట్ల రూపాయలు జరిగిందని ఇలా మొత్తంగా కలుపుకొని రూ.200 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత నాగావంశి స్పందించడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకి ఎలాంటి బిజినెస్ జరగలేదని తేల్చి చెప్పారు. అయితే ఈ మధ్యనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసాము.. ఇంకా నాన్ థియేట్రికల్ కు సంబంధించి హక్కుల కోసం ఎవరు సంప్రదించలేదని తెలియజేశారు.

Producer Naga Vamsi talk about Mahesh Babu role in SSMB 28- Chitrambhalare
ఇక మేము కూడా వెంటనే ఎటువంటి ఓటిటి సంస్థను కూడా సంప్రదించలేదని తెలియజేశారు. ఒకవేళ ముందుగా మేము సంప్రదించినట్లు అయితే వాళ్లే ఏదో ఒక ఫీవర్ అడుగుతారని అందుకోసం మేము ఇంకా ఎవరిని సంప్రదించలేదని తెలియజేశారు. ముందుగా ఈ సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది అనే విషయంపై అవగాహన వచ్చిన తర్వాతనే అప్పుడే నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి ఆలోచిస్తామని తెలియజేశారు నాగ వంశీ. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ విషయంపై వచ్చిన పుకార్లకు చెక్ పెట్టారని చెప్పవచ్చు.