కీర్తి సురేష్ ని వెంటాడుతున్న భయాలేమిటి? అందుకేనా ఈ ప్లాప్స్?

కీర్తి సురేష్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆమె చేసిన మూడో సినిమాకే జాతీయ ఉత్తమనటి అవార్డు ఆమె వాకిట ముంగిట నిలిచింది. ఈమధ్య కాలంలో తమిళంలో దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి నటించిన సాని కాగితం చిత్రంలో కీర్తీ సురేష్‌ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ఆమెకి తగిన గుర్తింపు రాలేదు. ఇక ఈమధ్య కాలంలో తెలుగులో కూడా చెప్పుకునేంత సక్సెస్‌లు రాలేదు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ బోళా శంకర్‌ చిత్రంపైనే అసలు పెట్టుకుంది.

అలాగే ఇంకో ఇంపార్టెంట్ సినిమా నానికి జంటగా నటించిన దసరా. ఈ సినిమా కూడా మంచి హైప్ తో రాబోతోంది. అయితే వీటిలో బోళా శంకర్‌ చిత్రం హిట్‌ అయినా ఆ క్రెడిట్‌ అంతా చిరంజీవికి పోతుంది. ఎటు తిరిగి దసరా చిత్రంతో ఈమె సక్సెస్‌ అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. అలాగే కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్‌ సరసన నటిస్తున్న మామన్నన్‌ సినిమా కూడా మంచి హైప్ తో రాబోతోంది. ఈమధ్య కాలంలో పెద్దగా హిట్లు పడని ఆమెకి ఈ సినిమాలు ఆమె భవిష్యత్ ని నిర్దేశించనున్నాయి.

ఈ క్రమంలో కీర్తి సురేష్‌ నటిగా తాను నటిస్తున్న పాత్రల గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాస్త వ్యధ చెందింది. ఒక విషయం ఆమెని ఎప్పుడు వేధిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటుంది. అదేమంటే షూటింగ్‌ పూర్తయినా పాత సినిమా పాత్రల ప్రభావం తనపై చాలా కాలం ఉంటుందని చెప్పింది. అవి ఏళ్ల తరబడి వెంటాడుతూనే ఉంటాయని తెలిపింది. కాగా ఈ మాటలు విన్న కీర్తి అభిమానులు కాస్త కలత చెందుతున్నారు. అలాంటి సమస్య వలన చేస్తున్న వర్తమాన సినిమాలు సరిగ్గా రావని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.