పాపం కీర్తి సురేష్‌.. షూటింగ్ పూర్తైనా వాటిని మాత్రం వ‌ద‌ల్లేద‌ట‌!

మహానటి కీర్తి సురేష్.. ప్రస్తుతం మంచి హిట్ అందుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. బహు భాషా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇటీవల సక్సెస్ కు దూరమైంది. తమిళంలో దర్శకుడు సెల్వ రాఘవన్ తో కలిసి నటించిన `సాని కాగితం` అని సినిమాలో కీర్తి సురేష్ మంచి మార్కులు అందుకుంది. అయినప్పటికీ ఈ సినిమా ఓటీడీలో రిలీజ్ కావడంతో అనుకున్నంత విజయం సాధించలేదు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చెప్పుకునే స్థాయిలో సక్సెస్ లు రాలేదు.

తాజాగా తెలుగులో `బోళా శంకర్` సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు గాను అలాగే `దసరా` సినిమాలో నాని సరసున హీరోయిన్గా నటిస్తుంది. వీటిలో `బోళా శంకర్` సినిమాలో చెల్లెలి పాత్ర కావడంతో సినిమా హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం చిరంజీవికే వెళ్లిపోతుంది. రెండోది `దసరా` సినిమాలో ఈమె సక్సెస్ అందుకుంటుందా? లేదా? అన్నది కొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే టాలీవుడ్ లో ఉదయనిది స్టాలిన్ సరసన నటిస్తున్న`మామన్నన్` సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్లో రెడ్ జాయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోని కీర్తి సురేష్ నటిగా తాను నటిస్తున్న పాత్రల గురించి ఓ షోలో మాట్లాడుతూ .. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. అయితే తాను కథ విన్నప్పుడు నచ్చితే అందులోని క్యారెక్టర్ లో లీనమైపోతానని.. నటించడానికి ముందే ఆ కథ‌ పాత్ర దాని రూపురేఖలు ఎలా ఉండాలి అన్నది మనసులో ముద్ర పడిపోతాయని పేర్కొంది. షూటింగ్ జరిగినప్పుడు నటించే సమయంలో ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తానని చెప్పుకొచ్చింది. అలా షూటింగ్ పూర్తయిన సరే ఆ పాత్రల ప్రభావం తనపై చాలాకాలం ఉంటుందని తనను వదలకుండా వెంటాడుతూనే ఉంటాయని కీర్తి సురేష్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. కొన్ని సంవత్సరాలు అయినా సరే ఆ ప్రభావం తన మీద ఉంటుందని ఆమె పేర్కొంది. ఇక కీర్తి సురేష్ బయటపెట్టిన ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.