‘కమ్మ’ సీట్లు క్లారిటీ..కానీ ఆయనకే డౌట్?

వచ్చే ఎన్నికల్లో యువతకు ఎక్కువ ప్రధానత ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు. యువతకు సీట్లు ఇస్తేనే..వారు యాక్టివ్ గా పనిచేసి గెలుపు గుర్రం ఎక్కుతారని బాబు నమ్ముతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎక్కువ మంది యువనేతలు పోటీ చేసే సక్సెస్ అయ్యారు. ఇక అదే ఫార్ములాతో బాబు ముందుకెళుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా యువతకు 40 శాతం సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. అదే దిశగా ముందుకెళుతున్నారు కూడా. ఇప్పటికే పలు స్థానాల్లో యువ నేతలకు ఇంచార్జ్ పదవులు ఇచ్చారు.

అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎస్సీ, బీసీ నేతలు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో యువ నేతలకు సీట్లు ఎక్కుయ ఇచ్చేలా ఉన్నారు. అదే కమ్మ నేతలు ఉండే చోట యువ నేతలకు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. అయితే కమ్మ వర్గంలో కూడా యువ నేతలు ఉన్నారు..కానీ వారికి అప్పుడే ఛాన్స్ దక్కేలా లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా సీనియర్ కమ్మ నేతలే పోటీకి దిగేలా ఉన్నారు.

ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లా గురించి మాట్లాడుకుంటే..అనేక ఏళ్ల నుంచి ఆరేడు స్థానాల్లో కమ్మ నేతలే పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ వారే నియోజకవర్గాలని చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళే బరిలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. పొన్నూరు-ధూళిపాళ్ళ నరేంద్ర, చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల-యరపతినేని శ్రీనివాసరావు, వినుకొండ-జీవీ ఆంజనేయులు, పెదకూరపాడు-కొమ్మాలపాటి శ్రీధర్ పోటీ చేయడం దాదాపు ఖాయం.

ఇటు మంగళగిరిలో లోకేష్ పోటీకి దిగనున్నారు. సత్తెనపల్లి సీటు కోసం కోడెల వారసుడు శివరాం ట్రై చేస్తున్నారు. కానీ ఆయనకు సీటు క్లారిటీ లేదు. అయితే సీనియర్లకు దాదాపు సీటు ఫిక్స్ అవ్వగా, తెనాలిలో ఆలపాటి రాజాకే క్లారిటీ రావడం లేదు. ఈ సీటు పొత్తు ఉంటే జనసేనకు ఇస్తారని ప్రచారం ఉంది. మొత్తానికి రాజా ఒక్కరికే సీటు విషయం క్లారిటీ రావడం లేదు. మిగిలిన కమ్మ నేతలకు సీట్లు ఫిక్స్.