గీత ఆర్ట్స్ బ్యానర్ పేరులో గీత అనే పేరు వెనుక ఇంత కథ ఉందా..?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తన బ్యానర్ పైన నిర్మించి ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇక చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలను సైతం తన బ్యానర్ పైన నిర్మించారు అల్లు అరవింద్. మంచి మంచి కథలను తన బ్యానర్ పై నిర్మిస్తూ గీత ఆర్ట్స్ చిత్ర పరిశ్రమలో మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ పేరు ఎలా వచ్చింది ఎవరు పెట్టారు అన్న విషయాలను అల్లు అరవింద్ తాజాగా ఒక టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

Exclusive: Director Cheated….But Why Geetha Arts Remained Silent?

గీత ఆర్ట్స్ అనేది తమ చిత్ర నిర్మాణ సంస్థకు పేరు పెట్టింది తన తండ్రి అల్లు రామలింగయ్య అని తెలియజేశారు. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారని తెలిపారు అల్లు అరవింద్. అంతేకాకుండా దాని పూర్తి వివరణ ..”ప్రయత్నం మాత్రం మనది కానీ ఫలితం మాత్రం మన చేతిలో ఉండదని గీత చెబుతుంది అదే చిత్ర నిర్మాతకు కూడా వర్తిస్తుందని ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు పెట్టుబడి పెడతారు కానీ ఫలితం మాత్రం ఆడియన్స్ చేతిలో ఉంటుందని.. అదృష్టం బాగుంటే పెట్టినా డబ్బులు కూడా వస్తుందని .. అందుచేతనే గీత అనే పేరు పెట్టినట్లు తెలిపారు.

Allu Aravind Big Blast: Divides all his assets between sons
చిరంజీవితో తన బ్యానర్ పై నిర్మించిన దాదాపుగా ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయని తెలిపారు. ఇక రామ్ చరణ్ తో తీసిన మగధీర సినిమా తన దగ్గర ఉన్నంత పెట్టుబడి పెడితే దానికి మూడింతలు లాభం వచ్చిందని తెలిపారు. అల్లు అరవింద్ అందుకే గీత ఆర్ట్స్ పేరు మార్చాలన్న ఆలోచన తమకి ఎప్పుడూ కూడా రాలేదని ఇక చదువుకునే రోజుల్లో కూడా తనకు గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేదట స్నేహితుడు కూడా ఆ పేరుతో ఆట పట్టించేవారు అని అల్లు అరవింద్ తన కాలేజీ విషయాలు కూడా తెలియజేశారు.