బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ షో కి తెలుగులో యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ షో ని ఎంతమంది తిడుతున్నారో అంతకంటే ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. నిజం చెప్పాలంటే షో ని బూతులు తిడుతున్న జనాలు కూడా ఇంట్రెస్ట్ గా చూసేవారు ఉన్నారు. కొందరు యూట్యూబ్లో రివ్యూస్ కోసం మరికొందరు బిగ్ బాస్ లో ఆఫర్ కోసం..కారణం ఏదైనా సరే బిగ్ బాస్ చూడడం మాత్రం మానట్లేదు జనాలు . ఈ క్రమంలోనే బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభిస్తుంది.
అయితే గత సీజన్స్ తో పోలిస్తే బిగ్ బాస్ 6 సీజన్ కు టీఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోతుంది . రోజురోజుకీ టిఆర్పి మరింత డౌన్ అవ్వడంతో బిగ్ బాస్ నిర్వాహకులు స్పెషల్ కేర్ తీసుకున్నారు . షోని ఎలా అయినా సరే ఆసక్తికరంగా మార్చడానికి విభిన్న రకాల కొత్త కొత్త టాస్కులు ఇంట్రెస్టింగ్ గేమ్స్ పెడుతూ కంటెస్టెంట్స్ మధ్య ఉన్నవి లేనిపోనివి క్రియేట్ చేస్తూ ప్రోమో ద్వారా టిఆర్పి రేటింగ్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు . అయితే షోలో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ లేకపోవడంతో బిగ్ బాస్ ఎంత ట్రై చేసినా టిఆర్పి రేటింగ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు .
ఈ క్రమంలోని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులకు కొత్త టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ . ఆయన సూచించిన హీరో హీరోయిన్ సినిమా గెటప్స్ వేయాలి . అలాగే సదరు హీరో హీరోయిన్ ని అనుకరించాలి. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆ గెటప్స్ కు తగ్గట్టు కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీ అవుతారు . అయితే ఈ గెటప్ లల్లో కంటెస్టెంట్స్ హౌస్ లో వినోదం పంచడం విషయంలో ఫెయిల్ అయ్యారు. కేవలం కప్ మీద కాన్సన్ట్రేషన్ చేశారే ..కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో జనాలను మెప్పించలేకపోయారు . మరీ ముఖ్యంగా బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ని పాటించలేదు.
దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిన బిగ్ బాస్ ఉన్న 15 మంది కంటెస్టెంట్లను గార్డెన్ ఏరియాలోకి పిలిచి.. హౌస్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చు అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా హౌస్ లోని కంటెస్టెంట్స్ షాక్ అయిపోయారు . ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ ప్రోమో పై జనాలు ఇష్టం వచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో ఉండే అర్హత కేవలం రేవంత్- ఫైమా -శ్రీహన్ లకు మాత్రమే ఉందని. మిగతా అందరూ అన్ని మూసుకొని దొబ్బెయ్యండి అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ వార్నింగ్ కి కంటెస్టెంట్లు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది పూర్తి ఎపిసోడ్ లో చూడాల్సిందే.