ఇంకోసారి ఆ మాట అంటే చెప్పుతో కొడతా..ఒక్కోక్కడికి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన పవన్ కల్యాణ్…!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు . మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాలలోనూ బిజీగా ఉన్నాడు. కాగా ఈ క్రమంలోనే వైజాగ్ జనవాణి సభ అనుకున్న ప్రకారం జరగలేదు. దీంతో ఫుల్ ఫైర్ అయిపోయిన పవన్ కళ్యాణ్ విజయవాడ వేదికగా మీడియా మిత్రులతో కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోపంతో ఊగిపోయారు .

అంతేకాదు ఎప్పుడు శాంతంగా ఉండే పవన్ కళ్యాణ్.. ఫస్ట్ టైం ప్రెస్ మీట్ లో కంట్రోల్ తప్పి మాట్లాడారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా ఆయన తన మాజీ భార్యల గురించి ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయాలల్లో సంచలనంగా మారింది. కాగా విజయవాడ వేదికగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ..వైసీపీ వాళ్లను బూతులు తిట్టాడు. వెధవ .. సన్నాసులు.. దద్దమలు అంటు నోటికివచ్చిన బూతులు తిట్టుకొచ్చారు . అంతేకాదు ఇంకోసారి ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా అంటూ కాలికి ఉన్న చెప్పు తీసి మరి చూపించాడు.

అంతేనా ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం కంట్రోల్ తప్పి పవన్ కళ్యాణ్.. నా కొడకల్లారా అంటూ ఓ రేంజ్ లో ఊగిపోయాడు. కాగా ఈ క్రమంలోనే తన పై వైసీపీ వాళ్లు ఎక్కువుగా పాయింట్ చేసే మూడు పెళ్లిలు గురించి చెప్పుకొచ్చారు. ” ప్రతి వెధవ మూడు పెళ్లిళ్లు.. మూడు పెళ్లిళ్లు.. అంటాడు . కావాల్సి ఉంటే మీరు చేసుకోండి ..మూడు పెళ్లిళ్లు. నేను వద్దన్నానా..? నేను విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. విడాకులు ఇచ్చిన వాళ్ళ సంతోషం కోసం భరణం ఇచ్చాను. మొదటి భార్యకు 5 కోట్లు ఇచ్చాను. రెండో భార్యకు ఆస్తిని ఇచ్చాను. వారిద్దరితో నాకు వర్కౌట్ అవ్వలేదు. అందుకే విడాకులు తీసుకున్నాను . చట్టబద్ధంగా మూడో పెళ్లి చేసుకున్నాను.. 3 ఒక్క పెళ్లి చేసుకొని 30 స్టెప్నిలతో కనెక్షన్స్ పెట్టుకునే మీరా విమర్శించేది..”అంటూ ఓ రేంజ్ లో ఊగిపోయారు.