తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట జబర్దస్త్ ద్వారా మంచి మంచి పాపులారిటీ చేసుకున్న వారిలో జబర్దస్త్ కమెడియన్ ధనరాజు కూడా ఒకరు. అయితే ఇండస్ట్రీలోకి మాత్రం జై సినిమా తో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత రామ్ తో కలిసి జగడం వంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. ఇక ఇందులో కామెడీ అనగా మంచి పేరు సంపాదించుకున్నారు.
ఇక తర్వాత బిగ్ బాస్ షో లో కూడా కన్సిస్టెంటుగా అడుగుపెట్టి ఆరు నెలలు తర్వాత ఎలిమినేట్ కావడం జరిగింది. ఆ తర్వాత మాటీవీలో కామెడీ షో చేస్తూనే మరొకవైపు చిత్రాలలో కూడా నటించారు. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న సమయంలోనే మంచి రెమ్యూనరేషన్ అందుకునేవారు ధనరాజ్. అలా సంపాదించిన డబ్బుని సినిమాలలో పెట్టుబడిగా పెట్టి మొత్తం పోగొట్టుకున్నారట. ధనరాజ్ కి జబర్దస్త్ కి దాదాపుగా రూ. లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారట. ఇక ధనరాజ్ సంపాదించిన డబ్బుని తన స్నేహితుడైన సాయి అచ్యుత్ చిన్నారి అనే డైరెక్టర్ తో ఒక సినిమాని తీయడానికి పెట్టుబడి పెట్టాడు ఆ చిత్రమే ధనలక్ష్మి తలుపు తడితే.
ఈ సినిమాకి నిర్మాతగా మారారు ధనరాజు ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే జబర్దస్త్ ఉంది అనుకొని అలా చేతినిండా సినిమాలు ఉన్నాయని ధైర్యంతో సినిమాని తీయడానికి ఓకే చెప్పారు. అలా సినిమా తీసిన ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీముఖి నటించింది. ఈ సినిమాకి శ్రీముఖిని ఎందుకు హీరోయిన్గా తీసుకున్నాను అంటే జులాయి చిత్రంలో తనను చూసి డైరెక్టర్ తనే హీరోయిన్ అయితే బాగుంటుందని తెలియజేశారట. ఇక తర్వాత సినిమా విడుదలయ్యాక వారం రోజులు పాటు సినిమా ఉంటుందని ఒప్పందం థియేటర్లతో కుదురుచుకున్నాడట. అయితే మొదటి రెండు రోజులకి కొన్ని థియేటర్లు టికెట్లు దొరకలేదు ఆ సమయంలో శ్రీముఖి కూడా ఫోన్ చేసి టికెట్లు కావాలని అడిగిందట. కానీ ఒక వారం రోజుల తర్వాత బాహుబలి సినిమా విడుదల కావడంతో తన సినిమాని తీసేశారని తెలిపారు. అలా చిత్రం బాగున్నా కూడా కలెక్షన్లు పోయాయని అలా చాలా డబ్బులు కోల్పోయానని తెలిపారు దన్ రాజ్.