అన్నయ్యేమో పార్టీ కోసం ఆస్తుల అమ్మితే..తమ్ముడికి పార్టీ నడిపే ఆస్తులు ఉన్నాయా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలు కాబోతోంది. అన్ని ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం పలు రకాలుగా ఫ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఇక అదే స్థాయిలో పార్టీ నాయకుల మధ్య పలు మాటల యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఒక విషయం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాటి గురించి చూద్దాం.. గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ కోసం చెన్నైలో ఉన్న ఆస్తులు అన్ని అమ్మవలసి వచ్చిందని తెలిపారు. అలాగే ప్రజారాజ్యం అనుభవాల ఆవేశం నుంచి వచ్చింది జనసేన అంటూ వివరణ ఇవ్వడం కూడా జరిగింది.

Chiranjeevi wishes to his brother and birthday boy Pawan Kalyan

ఇదంతా ఇలా ఉన్నప్పటికీ టాలీవుడ్ లో అత్యంత ధనవంతుల జాబితాలలో చిరంజీవి నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. అలాంటి చిరంజీవి పార్టీ కోసం ఆస్తులు అమ్మేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లో కంటే ఇప్పట్లో పార్టీ ఖర్చులు మరింత పెరిగిపోయాయి అని కూడా చెప్పవచ్చు. ఎన్నికలు మొత్తం కేవలం డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . దీంతో ఇప్పుడు పార్టీని నడపడం అంత ఆషా మాషీ అయిన విషయం కాదు. అన్నయ్య పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నప్పుడు తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తారు.. తమ్ముడు దగ్గర అంత విలువైన ఆస్తులు ఉన్నాయా? అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

TDP says it got tricked by Jana Sena chief Pawan Kalyan | Mint
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కు ఉందని చెప్పవచ్చు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్ , చిరంజీవి లాంటి వారు సైతం కొన్ని వందల సినిమాలు తీయాల్సి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ కనీసం 50 సినిమాలు కూడా తీయలేదు.. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా బాగానే పేరు సంపాదించారు. కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే గెలుస్తారా అనుకుంటే అది పెద్ద పొరపాటే. కేవలం హీరో పరంగా అభిమానులు ఉన్నా.. ఓట్ల పరంగా మాత్రం అభిమానాన్ని చూపించలేకపోతుంటారు. అందుచేతనే పవన్ కళ్యాణ్ కు పార్టీ నడపడం కత్తి మీద సామని చెప్పవచ్చు. ఇక ఎన్నికలలో నిలబడి పోటీగా గెలవాలి అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. చిరంజీవి రూ. 1500 కోట్ల దాక ఉన్నా.. పార్టీ కోసం చెన్నైలోని ఆస్తులు అమ్మవలసి వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎలా చేస్తారో చూడాలి.