ఎస్పీ బాలసుబ్రమణ్యం – రోజా తండ్రి మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, రియాల్టీ షోలకు జడ్జిగా, మంత్రిగా, ఫైర్ బ్రాండ్ గా రకరకాల పాత్రలు పోషిస్తున్న రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నిజజీవితంలో కూడా తల్లిగా, భార్యగా తన బాధ్యతలను నెరవేరుస్తోంది. 1992 చిత్తూరులోని తిరుపతిలో నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు శ్రీలతా రెడ్డి గా జన్మించిన రోజా సినిమాలోకి వచ్చిన తర్వాత తన పేరును మార్చుకొని సత్తా చాటసాగింది. ఇక రాజేంద్రప్రసాధ్ సరసన ప్రేమ తపస్సు అనే సినిమాలో మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి నేటి వరకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Singer SP Balasubrahmanyam is no more | Entertainment News,The Indian  Express

ఇక చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు దీటుగా నటించి ఎన్నో సినిమాలలో మరెన్నో పాత్రలను సైతం పోషించింది.. ఇకపోతే ప్రస్తుతం రాజకీయాల వల్ల సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె మార్కు మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తమిళ్, మలయాళం చిత్రాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మారి సినిమాలను నిర్మించింది. ఇక ఒకానొక దశలో సినిమాల వల్ల పాతాళంలోకి పడిపోయిన రోజా ఆర్థిక పరిస్థితి మళ్లీ రియాల్టీ షోల ద్వారా ఊపందుకుంది. ఇక తమిళ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే తమిళ్ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక రోజాకి పాప, బాబు ఉన్న విషయం తెలిసిందే.


ఇకపోతే రోజా తండ్రి నాగరాజు రెడ్డికి సంగీత విధ్వంసులు ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య మంచి అనుబంధం ఉంది. వారిద్దరూ మంచి స్నేహితులు.. ఇక వీరిద్దరూ కలిసి తిరుపతిలో PUC చదువుకున్నారు. చిన్నతనంలోనే తన తండ్రితో పాటు బాలుని చూడడానికి రోజా కూడా వెళ్లేదట. ఇక రెండు జడలు వేసుకొని సన్నగా బక్కగా ఉన్న రోజాని చూసి బుగ్గలు గిల్లేవారట బాలు. ఇక రోజా పెరిగి పెద్దయిన తర్వాత సినిమాలలో నటిస్తుంది అని , ఆరోజు ఆయన ఊహించలేదు.. ఆ తర్వాత రోజా నటించిన ఎన్నో సినిమాలలో బాలు ఎన్నో పాటలు పాడడం విశేషం.