డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా చేసిన సినిమా ఏంటో తెలుసా..?

సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ ఇటీవల కాలంలో డైరెక్టర్ గా కూడా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. నిజానికి తెలుగు సినిమా రంగంలో పనిచేసే ఒక సినీ రచయిత , నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కథ ఎలా ఉన్నా సరే ఆ సినిమాలో హీరో పాత్రకి ఒక కొత్త క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఎన్నో సినిమాలకు కథ అందించేది వక్కంతం వంశీనే. అలా ఈయన టెంపర్ , రేసుగుర్రం, ఎవడు, ఊసరవెల్లి, కత్తి , అతిధి, కిక్ , అశోక్ , కలుసుకోవాలని, టచ్ చేసి చూడు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఏజెంట్ వంటి పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు వక్కంతం వంశీ.

Director Vakkantham Vamsi Asked For An Apology
రచయితగానే ఎంతో మందికి పరిచయం ఉన్న వక్కంత వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాకు దర్శకత్వం వహించారు . అంతేకాదు నటుడిగా కూడా చిత్రం భళారే విచిత్రం , ఎంత బాగుందో వంటి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈయన కల్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోగా నటించాడు. 1996 సాయి శ్రీమల్ ఫిలిమ్స్ పతాకం పై ఎస్. మల్లేశం నిర్మాణ సారధ్యంలో.. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వక్కంతం వంశీ హీరోగా నటించారు. ఇందులో సుమా కనకాల హీరోయిన్గా నటించినది. అంతేకాదు కావ్య , మధు వంటి వారు తొలిసారిగా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Anchor Suma in Kalyana Prapthirasthu Film | ఫ్లాష్ బ్యాక్: సుమ హీరోయిన్..  స్టార్ రైటర్ హీరో! | Tupaki Telugu

అయితే విడుదల 1996 డిసెంబర్ 12వ తేదీన విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమా భారీ డిజాస్టర్ ను అందుకుంది. అంతేకాదు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ భారీ డిజాస్టర్ సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వక్కంతం వంశీ మళ్లీ హీరోగా నటించలేదు . ఆ తర్వాత రచయితగా తన పని తాను చేసుకుంటూ బెస్ట్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో నటించిన సుమా కనకాలా కూడా యాంకర్ గా తన ప్రస్తానాన్ని పదిలం చేసుకుంది.