అల్లు అరవింద్ కంత్రీగాడు..రాత్రికి రాత్రి “కాంతారా” సినిమాను ఆయన నుండి దొబ్బేసాడా..?

“కాంతారా..కాంతారా..కాంతారా..”ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సెప్టెంబర్ 30న కర్ణాటకలో రిలీజ్ అయిన ఈ కాంతారా సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టిస్తుంది . ఈ సినిమా ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది . మరీ ముఖ్యంగా కర్ణాటక జనాలకు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఈ క్రమంలోనే సినిమా పేరు మరింత హైలెట్ చేసారు. దీంతో ఈ సినిమా మరింత పాపులారిటీ దక్కించుకుంది .

కాగా కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలని మొదటి నుంచి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లో ఒకరైన సురేష్ బాబు అనుకున్నారట . అంతేకాదు దర్శక నిర్మాతలతో మాట్లాడి ఓ ఫైనల్ అమౌంట్ కూడా ఫిక్స్ అయ్యారట . కానీ అతి తొందర గల అల్లు అరవింద్ రాత్రికి రాత్రే తన పలుకుబడితో.. తన వెనకాల ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడించి ..ఈ సినిమా తెలుగు రైట్స్ ఆయన రెండు కోట్లకు దక్కించుకున్నాడట. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

నిజానికి ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్ పక్క ప్రణాళికతో వెళ్తున్నాడు . చిన్న సినిమాలను డబ్ చేస్తూ కోట్లల్లో ప్రాఫిట్ లు అందుకుంటున్నారు. కాంతారా సినిమా విషయంలోనూ అదే జరిగింది . కేవలం రెండు కోట్ల కు కాంతారా తెలుగు చిత్ర హక్కులను సొంతం చేసుకున్న అల్లు అరవింద్ ..ఇప్పటివరకు దాదాపు 6 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది. కాంతార రన్ ముగిసే నాటికి రూ. 15 నుండి 20 కోట్ల షేర్ ఈ మూవీ రాబట్ట వచ్చు అని ట్రేడ్ వర్గాల అంచనా. ఏది ఏమైనప్పటికీ ఇంత మంచి అవకాశం సురేష్ బాబు మిస్ చేసుకోవడం దగ్గుబాటి ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు.