వన్ టూ వన్..బాబు ‘క్లాస్’.!

గతానికి భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ఉంది..గతంలో ఎవరైనా నాయకులు సరిగ్గా పనిచేయకపోయినా చూసి చూడనట్లుగా వదిలేసేవారు. అలాగే సీట్లు కూడా ఇచ్చేవారు. దీని వల్ల టీడీపీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగింది. అయితే ఈ సారి ఆ పరిస్తితి రానివ్వకూడదు అని చెప్పి బాబు పనిచేస్తున్నారు. ఈ సారి అధికారం దక్కించుకోవడం ఎంత ముఖ్యమో బాబుకు బాగా తెలుసు..మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఏం అవుతుందో కూడా తెలుసు.

అందుకే ఎక్కడా కూడా తప్పు జరగకుండా చూసుకుంటూ..టీడీపీ నేతలు దూకుడుగా పనిచేసేలా బాబు చూసుకుంటున్నారు. అదే సమయంలో నేతలు సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం పడట్లేదు..మొహం మీదే పనితీరు బాగోలేదని, ఇలాగే ఉంటే సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది..అయినా సరే ఇప్పటినుంచే బాబు దూకుడుగా ముందుకెళుతున్నారు. జగన్ సైతం..ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే.

ఎప్పటికప్పుడు వర్క్ షాపు పెడుతూ..ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నారు. సరిగ్గా పనిచేయకపోతే సీటు  కూడా ఇవ్వనని జగన్ తేల్చేస్తున్నారు. సేమ్ బాబు కూడా ఎప్పటినుంచో..అసెంబ్లీ స్థానాల వారీగా ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ సమావేశం పెట్టి..నియోజకవర్గాల వారీగా నేతల పనితీరు ఎలా ఉంది..ఇంకా ఎలా పనిచేయాలి..అసలు సరిగ్గా పనిచేయకపోతే గట్టిగా క్లాస్ ఇచ్చి..బాగా పనిచేయాలని చెబుతున్నారు. అలాగే పనిచేసే నేతలకు ఇంకా పనిచేయాలని సూచిస్తున్నారు.

అలాగే కొందరికి సీట్లు కూడా దాదాపు ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది..కాకపోతే అధికారికంగా మాత్రం సీట్లు ఖరారు చేయట్లేదు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు అని చెప్పేశారు. అయితే ఇంచార్జ్‌లకు సీటు ఫిక్స్ చేయలేదు. ఇప్పటికే సగానికి పైనే నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో బాబు సమావేశమయ్యారు. అలాగే వారికి వారి స్థానాల్లో ఉన్న పరిస్తితులని వివరిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఎర్రగొండపాలెం, చీరాల స్థానాలకు ఇంచార్జ్‌లని ప్రకటించారు. ఎర్రగొండపాలెంకు ఎరిక్షన్ బాబు, చీరాలకు కొండయ్యని ఫిక్స్ చేశారు. మొత్తానికి వన్ టూ వన్ సమావేశాల్లో బాబు దూకుడుగా ఉన్నారు.