పొన్నియన్ సెల్వన్ 1 ప్రీమియర్ టాక్ షో పై ట్విట్టర్ రివ్యూ..!!

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ వారు మద్రాస్ టాకీస్ వారు నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు విభాగాలుగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించడం జరుగుతుంది. ఇక తాజాగా ఈ రోజున మొదటి భాగం విడుదలైంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషలలో విడుదల చేయడం జరిగింది. ఇందులో కోలీవుడ్ స్టార్స్ యాక్టర్స్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష , శరత్ కుమార్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు.

Ponniyin Selvan's Telugu pre-release business details are here -  TeluguBulletin.com

ఇప్పుడిప్పుడే దక్షిణాది సినిమాల హవా బాగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పొన్నియన్ సెల్వన్ చిత్రం ఎలా ఉండబోతోంది అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపించాయి. మరి ఈ సినిమా చూసిన కొంతమంది నెటిజన్లు ఎలా స్పందించారో సోషల్ మీడియాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం.

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారని కొంతమంది నెటిజెన్లు ఈ సినిమా పైన స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐశ్వర్య రాయ్ అందం , నటనతో నందిని పాత్రకు ప్రాణం పోసిందని, కుందవై పాత్రలో త్రిష కూడా ఎంతో ఒదిగి నటించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నారు.

చియాన్ విక్రమ్ ఈ సినిమాలోని పాత్రలో జీవించారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలోని విజువల్స్, క్లైమాక్స్ అన్ని ప్రేక్షకులను మైమరిపించేలా ఉండడమే కాకుండా స్టోరీలు మెస్మరైజ్ అయ్యేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోని కొన్ని సెకండాఫ్ సన్నివేశాలు లేవని , మిగతా అన్ని బాగున్నాయని మరి కొంతమంది రివ్యూలలో తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో డైరెక్టర్ మణిరత్నం మంచి విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు.