ఆదిపురుష్ చిత్రం నుంచి సడన్ సర్ప్రైజ్.. రాముడొచ్చేసాడు..!!

ఇండియన్ మోస్ట్ వెయిటింగ్ చిత్రాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడు పాత్రలో నటించబోతున్నారు. ఇక రాముడు గెటప్ లో ఫాన్స్ మేడ్ పోస్టు అంతకంతకు అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఫాన్స్ మేడ్ నే ఈ రేంజ్ లో ఉంటే డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ ని రాముడిగా ఇంకెంత అందంగా చూపిస్తారని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఉంటున్నారు.

తాజాగా వాటన్నిటికీ బదిలిస్తు కొద్దిసేపటి క్రితం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీవ్ చేయడం జరిగింది. టీజర్ రిలీజ్ కి ఇంకా రెండు రోజుల సమయం ఉండంగానే అభిమానులకు ఓం రౌత్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పవచ్చు ప్రభాస్ రాముడు పాత్రలో ఒదిగిపోయి పొడువాటి జుట్టుతో చేతుల రుద్రాక్ష మాల ధరించి రాముడు ఆకాశానికి ఇల్లు ఎక్కిపెట్టి పవర్ఫుల్ లుక్కులో కనిపించారు. అచ్చంగా రాముడు దిగి వచ్చినట్లుగానే ప్రభాస్ ఈ లుక్ లో కనిపించారు. ఇక అందుకు సంబంధించి తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Adipurush Teaser Release Date: Prabhas, Kriti Sanon, Saif Ali Khan Starrer  Epic First Look to be Revealed During Navratri!

ఇక దీంతో అభిమానుల సైతం రాముడు వచ్చాడు అంటు అభిమానులు పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఓం రౌత్ తమ ప్రయాణంలో భాగం కండి అని కోరుకున్నారు.మా అద్భుతమైన ప్రయాణంలో మీరు భాగం కండి ఉత్తర రాష్ట్రం అయోధ్యలో అక్టోబర్ 2వ తేదీన రాత్రి 7:11 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నామని తెలియజేశారు. ఈ చిత్రం వచ్చేయడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు.