వైసీపీ కంచుకోటపై బాబు ఫోకస్?

నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నెల్లూరుని..వైసీపీని సెపరేట్‌గా చూడలేని పరిస్తితి. గతంలో ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి వచ్చేసింది…అలాగే బలమైన నేతలు వైసీపీలోకి వచ్చారు. దీంతో నెల్లూరులో వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. మెయిన్ గా ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ..అందుకే ఇక్కడ వైసీపీ హవా ఉంటుంది. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 7 మంది రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు అంటే…ఇక్కడ రెడ్డి వర్గం ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇలా వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరుపై ఇప్పుడు చంద్రబాబు ఫోకస్ పెట్టారు. వైసీపీ దెబ్బకు ఇక్కడ టీడీపీ నాయకులు సరిగ్గా పనిచేయలేని పరిస్తితి. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. అందుకే ఈ సారి వైసీపీని దాటాకపోయినా..కనీసం మూడు, నాలుగు సీట్లు అయిన గెలుచుకోవాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా వచ్చిన సర్వేలో కూడా టీడీపీకి కాస్త జోష్ వచ్చే ఫలితాలు వచ్చాయి. నెల్లూరులో టీడీపీ మూడు సీట్లు గెలుచుకోవచ్చని తేలింది. అటు వైసీపీకి ఐదు సీట్లు వస్తాయని తేలింది. అలాగే రెండు సీట్లలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందట. ఇక ఈ సర్వేతో నెల్లూరు టీడీపీలో జోష్ పెరిగింది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. గత మహానాడు దగ్గర నుంచి వరుసగా మినీ మహానాడులు నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మినీ మహానాడులు కూడా సక్సెస్ అవుతున్నాయి.

ఇదే క్రమంలో ఈ నెల 14న నెల్లూరులో మినీ మహానాడుకు బాబు ప్లాన్ చేశారు. అలాగే మరో రెండు రోజుల పాటు నెల్లూరులో పర్యటించనున్నారు. 15వ తేదీ నెల్లూరు నేతలతో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే 16వ తేదీ నెల్లూరు నుంచి గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట మీదుగా రోడ్ షో ఉంటుంది. ఇలా మూడు రోజుల పాటు నెల్లూరులో మకాం వేయనున్నారు. మరి ఈ పర్యటన తర్వాత అయిన నెల్లూరులో టీడీపీ పరిస్తితి మేరుగు అవుతుందేమో చూడాలి.