ఒక్క సినిమాతో పరువు పోయింది.. దర్శకేంద్రా మీకు అవసరమా అంటూ..!

బుల్లితెర నటులతో నిండిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సుడిగాలి సుధీర్, సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం ఇలా కమెడియన్స్ అందరూ ఈ సినిమా కనిపిస్తారు. ఆగస్టు 19న రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం లేకుండా అత్యంత చెత్త సినిమాగా ప్రక్షకులు అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా చూడకుండానే థియేటర్ నుంచి మధ్యలోనూ వస్తున్నారంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలోని కామెడీ ట్రాక్ అసలు ప్రేక్షకులకు నవ్వు కూడా తెప్పించలేకోపోంది.

ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందించారు. కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీధర్ సీపాన సినిమా అంతటా ప్రేక్షకులను కట్టిపడేయంలో విఫలమయ్యారు. ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఎవ్వరి పాత్ర గుర్తుండేలా తీర్చిదిద్దలేదు. వంద సినిమాలు తీసిన అనుభవం ఉన్న రాఘవేంద్రరావుకు ఈ సినిమా కథ ఎలా నచ్చిందో అంటూ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో రాఘవేంద్రరావు విరివిగా పాల్గొన్నారు.

ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంటుందని కూడా రాఘవేంద్రరావు అన్నారు. కానీ సినిమాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సినిమాలో కామెడీ కంటే జబర్దస్త్ కామెడీ షోనే బెటర్ అన్న వాదన వినిపించింది. సాధారణ ప్రేక్షకులకు ఒక్క క్షణం కూడా ఎంగేజ్ చేయదు. చాలా మంది రాఘవేంద్ర రావును విమర్శిస్తున్నారు. ఇంత చెత్త మూవీకి సమర్పకుడిగా ఉండి ఆయన పరువు పోగొట్టుకున్నారని అంటున్నారు. ఎన్నో హిట్ సినిమాలు అందించిన దర్శకుడు ఇలాంటి చెత్త సినిమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టె విధంగా ఉంది..