రామోజీ – షా భేటీ వెన‌క టాప్ సీక్రెట్‌… ఇంత స్కెచ్ వేస్తున్నారా…!

తాజాగా జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు.. అనేక విశ్లేష‌ణ‌ల‌కు దారితీస్తోంది. రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా.. మేధా విగా.. టీడీపీని వెనుక నుంచి న‌డిపిస్తున్న మీడియా మొఘ‌ల్‌గా.. పేరున్న రామోజీరావుతో .. బీజేపీ అగ్ర నాయ‌కుడు.. కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కావ‌డం.. అనేక చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. తెలంగాణ ప‌ర్య‌టన కు వ‌చ్చిన షా.. అనూహ్యంగా రామోజీతో భేటీ అయ్యారు. వాస్త‌వానికి.. రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఎప్పుడూ.. ఇలాంటి సూచ‌న‌లు చేయ‌లేదు.

Ramoji Rao and Amit Shah are excited about their meeting

అయితే.. కేంద్రంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు కీల‌క పోస్టులో ఉన్న ఒక అగ్ర‌నాయ‌కుడి సూచ‌న‌ల మేర‌కు.. షా.. రామోజీతో భేటీ అయ్యార‌ని అంటున్నారు. అది కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని ఫోక‌స్ చేసేందుకు పెద్ద వ్యూహందీని వెనుక ఉంద‌ని చెబుతున్నారు. ఏపీలో పార్టీ పుంజుకోవాల‌ని.. బీజేపీ భావిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ఏపీలో అధికారంలోకి రావాల‌ని.. బీజేపీకి లేక‌పోయినా.. వ‌చ్చే ప‌దేళ్ల‌లో ఏపీలో అధికారంపై దృష్టి ఉంది. కానీ, తెలంగాణ‌లో మాత్రం ఇప్ప‌టికిప్పుడు అధికారంపై దృష్టి పెట్టింది.

Ramoji Rao and Amit Shah are excited about their meeting

ఏపీ విష‌యానికి వ‌స్తే… టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్ర‌తిసారీ.. బీజేపీ పుంజుకుంది. ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల లో ఆ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. 2019లో దూర‌మైన పొత్తు కార‌ణంగా.. టీడీపీ కంటే.. బీజేపీ ఎక్కువ‌గానే న‌ష్ట‌పోయింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి-టీడీపీకి మ‌ధ్య పొత్తు పొడిచేందుకు.. కొంద‌రు తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు.. బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ.. ఈ ప్ర‌య‌త్నాలు ముందుకు సాగ‌డం లేదు.

Ramoji Rao invites Amit Shah to RFC; may try to mediate for a return of TDP into NDA

ఈ క్ర‌మంలో బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని ఒప్పించేందుకు.. అనేక ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిశ‌గా సంకేతాలు మాత్రం రావ‌డం లేదు. ఇప్పుడు.. రామోజీ ద్వారా.. వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు రాజ‌కీయాల్లో చ‌ర్చ సాగుతోంది. ఏపీలో ఉన్న ప‌రిస్థితులు.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఒన‌కూరే ప్ర‌యోజ‌నాలు వంటివాటిపై.. రామోజీతో చ‌ర్చించేందుకే.. ఈ భేటీని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

PM Modi, Amit Shah to be felicitated by Gujarat BJP on May 26