నాయీ బ్రాహ్మణులను కించ ప‌రిచే ప‌దాల‌పై ఏపీలో నిషేధం… ఆ ప‌దాలు ఇవే…!

నాయీ బ్రాహ్మణులను, వారి కులాన్ని, వారి వృత్తిని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి ఇటువంటి ప‌దాల‌ను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు కార‌ణ‌మైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద న్యాయ‌పరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్‌ 50 జారీ చేశారు.

Ban on Derogatory Words Against Nayee Brahmins: AP Govt Issue Go - Sakshi

ఆగస్టు 7న జారీ చేసిన ఈ జీవో బుధవారం వెలుగులోకి వచ్చింది. కుల దోషలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ఇవ్వటంపై నాయి బ్రాహ్మణుల సంఘం హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు చెప్పారు. జీవో ఎంఎస్ 50ను రాష్ట్రమంతట ప్రచారం చేసి తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం అని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

ఇక ఇది క్రమంలో తెలంగాణలో ఉన్న నాయి బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు మద్దికుంటం లింగం నాయి సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఇదే క్రమంలో తెలంగాణలో కూడా నాయి బ్రాహ్మణులను కించపరిచే పదాలను నిషేధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు.