ది వారియర్ డైరెక్టర్ కు 6 నెలలు జైలు శిక్ష.. కారణం..?

తమిళ డైరెక్టర్ లింగుస్వామి తాజాగా చిక్కుల్లో పడ్డారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తమిళనాడులో సైదాపేట కోర్టులో అతనితోపాటు తన సోదరుడికి కూడా ఆరు నెలలు జై శిక్ష విధించినట్లుగా సమాచారం. తన ప్రాజెక్టు కోసం తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేదని అలాగే అతను ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయిందని ఒక ప్రొడ్యూసర్ కంపెనీ కోర్టును ఆశ్రయించారు సోమవారం విచారణ జరిపిన కోర్టు డైరెక్టర్ లింగు స్వామికి అతని సోదరుడు సుభాష్ చంద్రకు ఆరు నెలల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.Anjaan, Paiyaa Movie Director Lingusamy Sentenced 6 Months Of Jailతమిళ హీరో ఆయన కార్తీ తెలుగులో కూడా మంచి పేరు సంపాదించారు. ఇక కార్తీ సమంత జంటగా కలిసి నటించిన చిత్రం మొన్ని ఏడు నాలుకుల్లా అనే సినిమా అని తెరకెక్కించేందుకు డైరెక్టర్ లింగుస్వామి PVP ప్రొడక్షన్ కంపెనీ వాళ్లతో కొన్ని రోజుల క్రితం డబ్బులు తీసుకున్నట్లు సమాచారం ఆ తర్వాత తీసుకున్న అప్పును లింగస్వామి తీర్చలేదు . దీంతో అతనిపైన సదరు కంపెనీ చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా చెక్ బౌన్స్ కేసు కింద లింగుస్వామి పై కోర్టుని ఆశ్రయించడం జరిగింది.Director Lingusamy Arrested For Financial Crime - News Bugz

లింగుస్వామి దాదాపుగా వారికి రూ.1.3 కోట్ల రూపాయలు విలువైన చెక్కును అందించినట్లు తెలుస్తోంది ఆ చెక్కు బౌన్స్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. సోమవారం విచారణ జరిపి సైదాపేట కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది అయితే లింగుస్వామి అతని సోదరుడు ఈ శిక్షపై ఆపిల్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇక డైరెక్టర్ లింగు స్వామి ఇటీవలే హీరో రామ్ పోతినేని, కృత్తి శెట్టి తో కలిసి ది వారియర్ చిత్రంని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసినట్లుగా సమాచారం.