రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం..?

దేశం గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నేటి కాలంలో అయితే దర్శకులను.. వారు తెరకెక్కించే చిత్రాలను బట్టి సినిమాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ కాలంలో కేవలం హీరోలను చూసే సినిమాలకు వెళ్లేవాళ్లు. పూర్తిగా ఆ కాలంలో హీరోలకు మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ దర్శకుడు రెండు మూడు హిట్లను సొంతం చేసుకున్నాడంటే చాలు ప్రేక్షకులు మూడో సినిమా కోసం క్యూ కడతారు. ఇక అలాంటి క్రేజ్ ఉన్న దర్శకులలో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం జరిగింది. ఇక రాజమౌళి తీసిన ప్రతి సినిమాకు కూడా మంచి టాక్ రావడమే కాకుండా థియేటర్లలో వేలకోట్ల కలెక్షన్లను కూడా రాబడుతున్నాయి.SS Rajamouli: 'Baahubali' director SS Rajamouli, family test negative for  Covid after 2 weeks of quarantine - The Economic Times

ఇక ఈయన తెరకెక్కించిన సింహాద్రి సినిమా ను పక్కన పెడితే రామ్ చరణ్ తో తీసిన మగధీర సినిమా టాలీవుడ్ లోనే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా రాజమౌళి పేరు మారు మ్రోగేలా చేసింది. ఇక అప్పటి వరకు ఉన్న స్టార్ డైరెక్టర్ శంకర్ తో పాటు మరికొంతమందిని రాజమౌళి వెనక్కి నెట్టేశారు. ఇక బాహుబలి సినిమాతో బాలీవుడ్ ని సైతం తన వైపు తిప్పుకున్న రాజమౌళి ఇక రెండు పార్ట్ లు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇక రాజమౌళి తెరకేక్కించిన మరో భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా దేశ విదేశాలలో సరికొత్త రికార్డును సృష్టించింది.

ఇదిలా ఉండగా రాజమౌళి కెరియర్ ప్రారంభంలో తను మొదలుపెట్టిన ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయింది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత జక్కన్న మోహన్ లాల్ హీరోగా ఒక మైథాలజికల్ డ్రామా తీయాలని అనుకున్నాడు. కానీ ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాష్ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసి బడ్జెట్ కారణంగా ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. అంతేకాకుండా సూర్య ప్రకాష్ నటించిన మొదటి సినిమాతో అట్టర్ ప్లాప్ కావడం.. రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం అయ్యింది.