ఎన్టీఆర్ వల్లే జాతీయ అవార్డును మిస్ చేసుకున్న నాగార్జున..కారణం..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగార్జున విక్రమ్ సినిమాతోనే మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు నాగార్జున. ఇక మాస్ లాంటి సినిమాలతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మన్మధుడు లాంటి సినిమాలతో మరొకసారి మన్మధుడిగా కింగ్ సినిమాతో కింగ్ నాగార్జున గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల వచ్చిన బంగార్రాజు సినిమా కూడా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.Nagarjuna- NTR: ఎన్టీఆర్ వల్లే నాగార్జునకి జాతీయ అవార్డు రాలేదు.. అసలేం  జరిగింది అంటే ? - OK Telugu

ఇక ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్న నాగార్జున ఈ సినిమా ఫలితం పై కూడా ఆయన పూర్తిస్థాయిలో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో కూడా మంచి ఊహగానాలు ఏర్పడుతున్నాయి. ఇకపోతే గతంలో సీనియర్ ఎన్టీఆర్ వల్ల నాగార్జున తన జాతీయ అవార్డును మిస్ చేసుకున్నాడు అనే వార్త బాగా వైరల్ గా మారుతుంది. అసలు విషయం ఏమిటంటే నాగార్జున హీరోగా నటించిన సంకీర్తన సినిమాకు జాతీయ అవార్డు రావాల్సి ఉండగా సీనియర్ ఎన్టీఆర్ పైన ఉన్న కోపం వల్ల కేంద్రం కొన్నేళ్లపాటు జాతీయ అవార్డులను ఆపివేసిందని ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ కూడా వెల్లడించారు.Watch Sankeerthana - Disney+ Hotstar

ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగుకు ఇవ్వాల్సిన అవార్డున సైతం ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అనే కారణంతో నాగార్జున నటించిన సంకీర్తన సినిమాకు జాతీయ అవార్డు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు అని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ ప్రత్యక్షంగా కారణం కాకపోయినా ఎన్టీఆర్ పరోక్షంగా నాగార్జునకి జాతీయ అవార్డును సొంతం చేసుకోలేక పోవడానికి కారణం అయ్యారు. ఇకపోతే ఆరు పదుల వయసులో కూడా దూసుకుపోతున్న నాగార్జున ఇప్పటికి యంగ్ హీరో గానే కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే నాగార్జున తాజాగా నటించిన ఒక్కొక్క సినిమాకు అటు ఇటు పది కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.